12 ఏళ్ల కాపురానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గుడ్ బై.. స్టార్ కపుల్ విడాకులు..
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎప్పుడు సెలబ్రిటీల విడాకులు టాపిక్ హాట్‌గానే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎవరి దాంపత్య జీవితానికి గండిపడుతుందో, ఎవరు విడిపోవబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో ఎక్కువైపోతోంది. సోషల్ మీడియా ప్రస్తుత పరిస్థితి కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం ఇస్తోంది. ఇప్పట్లో ఎవరైనా నటుడు లేదా నటి తమ జీవిత భాగస్వామిని అన్‌ఫాలో చేస్తే గానీ, వారి ఫొటోలు అకస్మాత్తుగా డిలీట్ చేస్తే గానీ వెంటనే గాసిప్ స్టార్ అవుతాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంది. ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈ జంట, అధికారికంగా తమ విడాకుల ప్రకటన ఇచ్చేసింది. ఇంతకీ ఆ సార్ట్ కపుల్ ఎవరు?
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా జరుగుతాయో, విడాకుల వార్తలు కూడా అంతే సంచలనం సృష్టిస్తున్నాయి. అభిమానులు తమ ప్రియమైన హీరో, హీరోయిన్, సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో ఈ విడాకుల వార్తలు మరింత హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. అలా.. దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్‌గా మారిన విషయ ఏంటంటే ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి (GV Prakash - Saindhavi) మధ్య 12 ఏళ్ల దాంపత్య బంధానికి అధికారికంగా ముగింపు పలికారు. చెన్నై తొలి అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి సెల్వ సుందరి మంగళవారం వీరి విడాకులను మంజూరు చేస్తూ తుది తీర్పు వెలువరించారు.
జీవీ ప్రకాశ్-సైంధవి జంట 2013లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. సినీ రంగంలో ఇద్దరూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో వీరి పెళ్లి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే, కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తిన విషయం మీడియాలో అప్పుడప్పుడూ వినిపించింది. ఆ విభేదాలు చివరికి విడాకుల వరకు వెళ్లాయి. తమ దాంపత్య జీవితం కొనసాగదని భావించిన ఈ జంట, ఈ ఏడాది మార్చి 24న చెన్నైలోని తొలి అదనపు ఫ్యామిలీ కోర్టులో మ్యూచువల్ డైవర్స్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం వారికి ఆరునెలల గడువు ఇచ్చారు. ఈ సమయంలో వారు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమూ ఇచ్చింది. అయితే, ఆ గడువు పూర్తయిన తరువాత కూడా ఇద్దరూ తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా, విడిపోవడానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు.

సెప్టెంబర్ 25న మళ్లీ విచారణకు రాగా జీవీ ప్రకాశ్, సైంధవి కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. న్యాయమూర్తి ముందు నిలబడి వారు విడాకులపై తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమయంలో ముఖ్యమైన ప్రశ్న ఒకటి ముందుకు వచ్చింది - "చిన్నారి ఎవరి వద్ద ఉంటుంది?" అని న్యాయమూర్తి అడగగా, కుమార్తె తల్లి సైంధవి వద్దే ఉండటం మంచిదని జీవీ ప్రకాశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అన్ని వాదనలను విన్న న్యాయమూర్తి సెల్వ సుందరి, సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువరించారు. ఇరువురి పరస్పర అంగీకారంతో విడాకులను మంజూరు చేస్తూ దాంపత్య బంధాన్ని అధికారికంగా ముగించారు. అలాగే, కుమార్తె తల్లి సైంధవే సంరక్షించుకోవాలని నిర్ణయించారు.
జీవీ ప్రకాశ్-సైంధవి దంపతులకు 2020లో కుమార్తె జన్మించింది. విడాకుల అనంతరం ఆ చిన్నారి తల్లి దగ్గరే పెరగనుంది. కుటుంబ విభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్న వీరు, చివరికి శాశ్వతంగా విడిపోవాలని తీసుకున్న నిర్ణయం, ఈ తీర్పుతో అమలులోకి వచ్చింది. సంగీత రంగంలో గాని, నటనలో గాని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాశ్, మరోవైపు తన మధుర గాత్రంతో అనేక హిట్ పాటలు పాడిన సైంధవి లు విడిపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం వీరి నిర్ణయాన్ని గౌరవిస్తూ, భవిష్యత్తు జీవితాన్ని సాఫీగా సాగాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











