twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Amitabh Bachchan మృత్యువును ఎదురించిన నటశిఖరం.. అమితాబ్‌ ఎవరెస్ట్ అంటూ చిరంజీవి విషెస్

    |

    భారతీయ నటశిఖరం అమితాబ్ బచ్చన్ 80 పడిలోకి ప్రవేశించారు. 1942లో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్ 11వ తేదీన జన్మించారు. అమితాబ్‌ను అభిమానులు బిగ్‌బీ, యాంగ్రీ యంగ్ మ్యాన్, బాలీవుడ్ షెహన్‌షా అని ముద్దుగా పిలుచుకొంటారు. 80 పుట్టిన రోజున జరుపుకొంటున్న అమితాబ్ బచ్చన్‌కు చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు విషెస్ అందించారు. బిగ్‌బీ జీవిత విశేషాలు, అరుదైన సంఘటనల్లోకి వెళితే..

    జంజీర్ సినిమాతో స్టార్‌గా

    జంజీర్ సినిమాతో స్టార్‌గా

    1969లో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన బిగ్‌బీ వినోద పరిశ్రమలోకి ప్రవేశించారు. సాత్ హిందూస్థాన్ అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి 1974 వరకు ఆయన నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆదరణను సంపాదించుకోలేకోయాయి. 1973లో వచ్చిన జంజీర్ సినిమాతో అమితాబ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి నుంచి అమితాబ్ వెనుదిరిగి చూసుకోలేకపోయారు.

    70వ దశకంలో సూపర్ హిట్లతో

    70వ దశకంలో సూపర్ హిట్లతో

    అమితాబ్ 70వ దశకంలో నటించిన రౌటీ కపడా ఔర్ మకాన్, దీవార్, షోలే, చుప్కేచుప్కే, దో అంజానే, కబీ కబీ, అమర్ అక్బర్ ఆంథోని, త్రిషూల్, డాన్, ముకద్దర్‌ కా సికంద్దర్, మిస్టర్ నట్వర్ లాల్, సుహాగ్, కాలా పత్తర్, నసీబ్, లావారీస్, సిల్ సిలా, కాలియా, సత్తే పే సత్తే, అంధా కానున్, కూలీ చిత్రాలు ఆయనను సూపర్ స్టార్‌గా చేశాయి.

    సూపర్ స్టార్‌గా భారీ విజయాలు

    సూపర్ స్టార్‌గా భారీ విజయాలు

    బిగ్‌ బీ హవా 80వ దశకంలోను కొనసాగింది. షరాబీ, ఆఖరీ రాస్తా, షెహన్‌షా, ఇంక్విలాబ్ చిత్రాలు కాసులు పంట పడించాయి. 90వ దశకంలో అగ్నిపత్, హమ్, ఖుదా గవా, బెడీ మియా చోటే మియా, బీవీ నంబర్ 1, మొహబ్బతే, కభీ ఖుషీ, కభీ ఘమ్, భాగ్‌భన్ చిత్రాలు హిట్లు కొట్టాయి. ఇక 2000 తర్వాత కూడా అమితాబ్ హవా కొనసాగింది. బ్లాక్, వీర్ జారా, బంటీ ఔర్ బబ్లీ, చీనీ కమ్, సర్కార్, పికూ, పింక్, సైరా చిత్రాల మంచి ఆదరణ పొందాయి.

    కూలీ షూటింగ్‌లో తీవ్ర ప్రమాదం

    కూలీ షూటింగ్‌లో తీవ్ర ప్రమాదం

    అమితాబ్‌ బచ్చన్‌కు 1983లో కూలీ షూటింగ్ సమయంలో తీవ్ర ప్రమాదం చోటు చేసుకొన్నది. దాంతో ఆయనకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అయితే ఆయన ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లివచ్చారు. మృత్యువుతో పోరాటం చేసి ఆయన మృత్యుంజయుడిగా మారారు. కూలీ మూవీ తర్వాత మళ్లీ సూపర్ స్టార్‌గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు.

    పీకల్లోతు అప్పుల్లో కూరుకపోయి..

    పీకల్లోతు అప్పుల్లో కూరుకపోయి..

    అయితే అమితాబ్‌ ఓ దశలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ స్థాపించి సినీ నిర్మాణంలోకి అడుగపెట్టారు. ఆయన రూపొందించిన చిత్రాలు భారీ నష్టాలకు లోనయ్యాయి. దాంతో ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో 2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్ పతితో బుల్లితెర మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన హోస్ట్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమం భారీ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కేబీసీ కొనసాగడం గమనార్హం. గత ఐదు దశాబ్దాలుగా సినిమాలు, టెలివిజన్ రంగంలో సూపర్‌స్టార్‌గా అమితాబ్ కొనసాగుతున్నారు.

    నట ఎవరెస్ట్ అంటూ చిరంజీవి

    అమితాబ్ బచ్చన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సైరా చిత్రంలో తనతో నటించిన బిగ్ బీ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80 జన్మదినం జరుపుకొంటున్న గురూజీ అమితాబ్ బచ్చన్‌కు నా శుభాకాంక్షలు. ఈ జన్మదినం రోజున మీ కలలన్నీ నెరవేరాలని, ఆయుఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకొంటున్నాను. మీరు నటనరంగంలో ఎవరెస్ట్ లాంటి వారు. మీరు సాధించిన విజయాలు, మీ ప్రతిభను స్పూర్తిగా తీసుకొంటాం. మీకు మరింత పవర్‌ను అందించాలని దేవుడిని కోరుకొంటున్నాను అని చిరంజీవి విషెస్ అందించారు.

    English summary
    Chiranjeevi wishes Bollywood Shahenshah Big B Amitabh Bachchan's 80th Birthday. Chiru tweeted that, Happy 80th birthday 💐my beloved Guru ji 🙏SrBachchan Sir ! May the almighty grant you good health, strength & every wish that you would ever have. You are the Everest among us Artists & we are in eternal awe of your talent & your accomplishments.More Power to you Amit ji!❤️
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X