ఆ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్... బీచ్‌లో అలా రొమాన్స్.. కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే?

తన ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోస్తాడు హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్‌తోనూ కాకుండా బౌలర్‌గా, ఫీల్డర్‌గా తన ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు పాండ్యా. వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌లో తన విధ్వంసకర ఆటతీరుతో కోట్లాది మందిని అలరిస్తున్నాడు పాండ్యా. అయితే క్రికెట్ కంటే కూడా తన ఎఫైర్లు, డేటింగ్, ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు పాండ్యా. తాజాగా కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

నటాషాతో పెళ్లి, విడాకులు
హార్డిక్ పాండ్యా ఇప్పటి వరకు పలువురు టాప్ హీరోయిన్లు, మోడల్స్‌తో డేటింగ్ చేశారు. ఈ లిస్ట్‌లో లిషా శర్మ, ఇల్లి అవ్వరం, పరిణితి చోప్రా, ఊర్వశి రౌటేలా, ఈషా గుప్తా, నటాషా స్టాంకోవిక్‌లు ఉన్నారు. వీరిలో నటాషానే 2020లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సెర్బియాకు చెందిన నటాషా.. మోడలింగ్‌తో పాటు పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే హార్డిక్‌తో పరిచయం, ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. సజావుగా సాగిపోతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. నటాషాతో విడాకులకు ముందు ఆ తర్వాతా కూడా హార్డిక్ తన ప్రేమాయణాలను సీక్రెట్‌గా సాగిస్తున్నట్లుగా క్రికెట్, బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది.

Hardik Pandya and Mahieka Sharma Relationship Cricketer confirms relationship with Instagram Photos

బ్రిటీష్ అమ్మాయితో రిలేషన్?
నటాషాతో బ్రేకప్ తర్వాత సినీనటి ఈషా గుప్తాకు పాండ్యా దగ్గరైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని... తాము రిలేషన్‌లోకి వెళ్లకుండా మధ్యలోనే విడిపోయినట్లు ఈషా తెలిపింది. ఆ వెంటనే దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన పాండ్యా... ఇదే టోర్నీలో ఓ కొత్త అమ్మాయితో తిరుగుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. జాస్మిన్ వాలియా అనే భారత సంతతికి చెందిన నటితో పాండ్యా ఎఫైర్ నడుపుతున్నట్లుగా కథనాలు వచ్చాయి.

మహీకా శర్మతో చెట్టాపట్టాల్
ఇప్పుడు ఆమెను కూడా వదిలేసి మరో నటితో పాండ్యా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు... మోడల్, నటి మహీకా శర్మ. కొద్దిరోజుల క్రితం మహీకా శర్మ పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో ఈ రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ వీడియోలో ఓ హోటల్‌లోని అద్దం ముందు నిలబడి మహీకా వీడియో తీసుకుంటున్నారు. అందులో ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పురుషుడి రూపం అచ్చు గుద్ధినట్లు హార్డిక్ పాండ్యా మాదిరే ఉండటంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఢిల్లీకి చెందిన మహీకా శర్మ... చదువు తర్వాత మోడలింగ్‌, నటనలోకి దిగి టాప్ బ్రాండ్లకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 2024లో జరిగిన ఇండియన్ ఫ్యాషన్ అవార్డుల్లో మోడల్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని మహీకా అందుకున్నారు.

బీచ్‌తో కొత్త గర్లఫ్రెండ్‌తో అలా
తాజాగా హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ బీచ్‌లో బికినీలో ఉన్న మహీకతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను పాండ్యా షేర్ చేశాడు. తద్వారా తాను ఆమెతో రిలేషన్‌లో ఉన్నానని పాండ్యా ఇన్‌డైరెక్ట్‌గా అంగీకరించినట్లయ్యింది. దీంతో పాండ్యా అభిమానులు, నెటిజన్లు పెళ్లెప్పుడు అంటూ ఆటపట్టిస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో తన కుమారుడు అగస్త్య కూడా ఉండటం విశేషం. అక్టోబర్ 11న హార్దిక్ పాండ్యా 32వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో మహీకతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫారిన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: hardik pandya bcci Mahieka Sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X