For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్లను అలా చెప్పుతో కొట్టావు అన్నయ్య.. మాస్ మహారాజా కాళ్లపై పడ్డ హరీష్ శంకర్.. రవితేజ కంటతడి

  |

  మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ధమాకా. ఈ సినిమా తొలి రోజు నుంచి భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ధమాకా చిత్రం 100 కోట్ల మైలురాయి వైపు దూసుకెళ్తుంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాస్ మీట్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..

  నలుగురు స్టార్లు పుట్టారు అంటూ

  నలుగురు స్టార్లు పుట్టారు అంటూ


  ధమాకా టీమ్‌కు కంగ్రాట్స్. విశ్వప్రసాద్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమోషన్స్ చూడలేదు. బాగా ప్రమోట్ చేశారు. సెలబ్రేషన్స్ బాగా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి హిట్ చూడలేదు. రవితేజ సినిమా హిట్ అయితే.. అన్నయ్య సినిమా హిట్ అయితే.. నా సినిమా హిట్ అయినంత సంబరం ఉంటుంది. ఈ సినిమాతో నలుగురు స్టార్లు పుట్టారు. దర్శకుడు త్రినాథ్, రచయిత ప్రసన్న స్టార్లు అయ్యారు, శ్రీలీల స్టార్ హీరోయిన్ అయింది అని హరీష్ శంకర్ అన్నారు.

  మాస్ మహారాజ్ అని పిలువమని..

  మాస్ మహారాజ్ అని పిలువమని..


  మాస్ మహారాజ్ అని రవితేజ అన్నయ్యను నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి పిలిచే వాడిని. ఓ ఫంక్షన్‌లో మాస్ మహారాజ్ అని సుమను పిలువమని చెప్పాను. అప్పటి నుంచి ఆ పేరును ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు చాలా హ్యాపీ. రవితేజ అన్నయ్య నాకు ఎప్పుడూ వెనుక ఉన్నారు. లవ్ యూ అన్నయ్య. చాలా మందికి తెలుసు. ఈ స్టేజ్ మీద ఉన్నా.. ఇండస్ట్రీలో ఉన్నా రవితేజ కారణమని చాలా సార్లు చెప్పాను అని హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు.

  ఆ డైరెక్టర్లకు మరో ఛాన్స్ అంటూ

  ఆ డైరెక్టర్లకు మరో ఛాన్స్ అంటూ


  రవితేజ్ వల్ల మలినేని గోపిచంద్, వైట్ల శ్రీను, బోయపాటి శ్రీను, బాబీ, హరీష్ శంకర్, టైగర్ నాగేశ్వర్ డైరెక్టర్ ఇలా చెప్పుకొంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. నా మొదటి సినిమా షాక్ డిజాస్టర్ అయితే.. రెండో సినిమా మిరపకాయ్ ఇచ్చింది అయనే. అంటే అన్నయ్య పేరు రవిశంకర్ రాజు. ఆయన లేకపోతే హరీష్ శంకర్ లేడు. లవ్ యూ అన్నయ్య అంటూ రవితేజ్ కాళ్లకు హరీష్ శంకర్ నమస్కారం చేశాడు.

  కాళ్లకు దండం పెట్టిన హరీష్ శంకర్

  కాళ్లకు దండం పెట్టిన హరీష్ శంకర్


  అన్నయ్యను కలిసిన ప్రతీ సారి నేను కౌగిలించుకోవడం చేస్తుంటాను. స్టేజ్ మీద దండం పెట్టాలంటే.. ఎప్పుడూ గుర్తుకు రాలేదు. ప్రతీసారి రాగానే హగ్ చేసుకొంటావు. కానీ సభాముఖంగా నీకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. నీ మీద గౌరవం, నా భక్తి, ప్రేమను చెప్పాలనుకొన్నాను. అందుకే దండం పెట్టాను. అందులో మరో విషయం లేదు అని హరీష్ భావోద్వేగానికి లోనయ్యాడు.

  రవితేజ సపోర్టును మరిచిపోలేను..

  రవితేజ సపోర్టును మరిచిపోలేను..


  షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఓ ప్రొడ్యూసర్‌తో విభేదాలు వచ్చి నా చిన్న సినిమా క్యాన్సిల్ అయింది. అప్పుడు రవన్నయ్య ఖతర్నాక్ సినిమా షూట్ చేస్తూ చెన్నైలో ఉన్నాడు. నా సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసి.. నాకు కాల్ చేశాడు. నీ క్యాన్సిల్ అయిన సినిమా ప్రొడ్యూసర్‌కు చెప్పు. నీ రెండో సినిమా ప్రొడ్యూసర్ కూడా రవితేజ అని. ఆ రోజును నేను ఎన్నడూ మరిచిపోలేను. నేను ఇండస్ట్రీలో ఏకవచనంతో పిలిచే హీరో రవితేజ. అతడి స్టార్ డమ్‌ను చూస్తున్నాను. నా జీవితంలో కీలకమైన పది సంవత్సరాలు రవితేజ సమక్షంలోనే గడిచిపోయాయి అని హరీష్ శంకర్ అన్నారు.

  రవితేజ తల్లిని కలువలేదు..

  రవితేజ తల్లిని కలువలేదు..


  రవితేజ తల్లితో కలిసి మార్నింగ్ షో సినిమా చూడటం అలవాటు. ధమాకా సినిమా షోలో రవితేజ తల్లిని కలువడం మిస్ అయ్యాను. ఆమె ఆశీర్వాదం ఎప్పుడూ తీసుకొంటాను. ధమాకా షోలో కలవడం కుదర్లేదు. అమ్మకు చాలాసార్లు చెప్పాలనుకొన్నాను. చెప్పలేదు. నీవు రవితేజకు జన్మనిస్తే.. రవితేజ నాలాంటి వాళ్లకు, ఎంతో మందికి జన్మినచ్చాడు. లాంట్ లివ్ మాస్ మహారాజ్ అని హరీష్ శంకర్ అన్నారు.

  చెప్పుతో కొట్టినట్టు సమాధానం అంటూ

  చెప్పుతో కొట్టినట్టు సమాధానం అంటూ


  సోషల్ మీడియాలో చాలా మంది మేధావులు రవితేజ గురించి చాలా కామెంట్లు చేశారు. టైమ్, సినిమా ప్రేక్షకుల అభిరుచి మారింది. పాటలు, ఫైట్లు సరిపోవు అనే వాళ్లకు ధమాకా సినిమాతో చెప్పుతో కొట్టినట్టు రవితేజ సమాధానం చెప్పారు. ఈ రాత్రికి ధమాకా సెలబ్రేషన్స్ ఆగిపోవు. రేపట్నుంచి సినిమా కలెక్షన్లు సంక్రాంతి వరకు కొనసాగుతాయి. ఇండస్ట్రీ షాక్ అయ్యే వసూళ్లను నమోదు చేస్తుంది.

  English summary
  Dhamka Movie is going good at box office. In this occasion, Film Unit organised Dhamaka Mass Meet. In this event, Bandla Ganesh made powerful speech about Ravi Teja.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X