Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ బర్త్ డే.. మోడీ, చంద్రబాబు, చిరు విషెస్.. వైరల్‌గా అల్లు అర్జున్ ట్వీట్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి నారా లోకేష్‌తో పాటు గత కొంతకాలంగా పవన్‌కు దూరంగా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఆయనకు విషెస్ తెలియజేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

'పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. మంచి పరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని శక్తమంతం చేస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన జీవితం ప్రసాదించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను'-- ప్రధాని నరేంద్రమోడీ
'మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి...మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.....మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు'--- నారా చంద్రబాబు నాయుడు
'జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!.. తమ్ముడు కల్యాణ్.. ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
'నేనున్నది మీకోసం అంటూ జనం వైపు పయనం సాగించే జనసేన అధ్యక్షులు.. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు.. సోదరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా... వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'--- నందమూరి బాలకృష్ణ
'వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు' --- మంత్రి నారా లోకేష్
'పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు '-- అల్లు అర్జున్
'పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ నిరాడంబరత, బలం, స్వార్ధం లేని వ్యక్తిత్వాన్ని చూస్తూ పెరిగినందుకు నేను అదృష్టవంతుడ్ని. మీ ప్రస్థానం నాతో సహా మిలియన్ల మందికి స్పూర్తిని అందిస్తూ కొనసాగాలి. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా'-- రామ్ చరణ్


Click it and Unblock the Notifications











