‘నా భర్త వెనుక ఆ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.. అమ్మాయిల్ని అలా వాడుకుని’

యువ హీరో ధర్మ మహేశ్ వ్యవహారం టాలీవుడ్‌‌లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అమ్మాయిలతో తిరుగుతూ... తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని అతని భార్య గౌతమి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అండగా నిలవాల్సిన అత్తమామలు కూడా మహేశ్‌కే సపోర్ట్ చేస్తూ తనను టార్చర్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసులంటే మహేశ్‌కు లెక్కలేదని గౌతమి తెలిపారు. ఇప్పటి వరకు ఏం చేసినా మౌనంగా భరించానని, కానీ నా బిడ్డ కోసం పోరాటానికి దిగానని ఆమె స్పష్టం చేశారు.

అమ్మాయిల పిచ్చి
గత రెండ్రోజులుగా మీడియా ముందుకు వస్తున్న గౌతమి చౌదరి తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. తొలుత రాజకీయాల్లోకి వెళ్దామని అనుకున్న మహేశ్.. ఆ తర్వాతకు తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రావడంతో హీరో కావాలని నిర్ణయించుకున్నాడని గౌతమి తెలిపారు. వందల కోట్లలో కట్నం కావాలని వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. కేవలం అమ్మాయిలతో గడిపేందుకే మహేశ్ సినీరంగంలో అడుగుపెట్టాడని గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాల్లో నటించే అమ్మాయిలు, బిగ్‌బాస్ యాక్టర్స్‌తో మహేశ్ గడుపుతుంటాడని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో నివసించే డాక్టర్ సాహిత్య అనే అమ్మాయితో తన భర్తకు ఎఫైర్ ఉందని ఆరోపించారు గౌతమి. తెల్లవారుజామున 4 గంటల వరకే ఆమె ఇంట్లో ఉంటాడని, ఆమె భర్తకు ఈ విషయాలన్నీ తెలిస్తే తట్టుకోలేడని పేర్కొన్నారు. మహేశ్‌తో ఇక కలిసి నడిచేది లేదని గౌతమి తేల్చేశారు.

Hero Dharma Mahesh Wife Gautami made sensational comments on her husband activities

అమ్మాయిల్ని కమిట్‌మెంట్ పేరుతో
తాజాగా ఓ ఛానెల్‌తో గౌతమి మాట్లాడుతూ.. 10 వేల మంది సమక్షంలో నా మెడలో తాళి కట్టి, నాతో ఏడాడుగులు వేసి నన్ను నీ సొంతమని భావించడం లేదు. మీ నాన్న మాట్లాడుతున్న మాటలేంటీ? మీ ఫ్రెండ్‌తో నా గురించి చెప్పిస్తున్న మాటలేంటీ? నువ్వు ఎంత మంది అమ్మాయిల్ని సినిమాల్లో అవకాశాల పేరుతో కమిట్‌మెంట్ అడిగావ్? ఈ విషయాలన్నీ బయటపెట్టే పరిస్ధితి తెచ్చుకున్నావ్. నా పని నన్ను ఎందుకు చేసుకోనివ్వడం లేదు.. నీ ఎదుగుదలను నేను అడ్డుకున్నానా? నువ్వు లేనప్పుడు నీ గురించి ఎంత గొప్పగా చెప్పాను.. నువ్వు నా గురించి ఎంతమందికి చెడ్డగా చెప్పావ్ అని గౌతమి ప్రశ్నించారు.

దేనికైనా రెడీ
ఇప్పటికైనా ఊహాలోకాల నుంచి, మీర్జాపూర్ సంస్థానం నుంచి 100 అడుగులు కిందకొచ్చి మాట్లాడితే బెటర్. సినిమాల్లోకి వెళ్లిపోయాక నేను హీరో అయిపోయాను, నన్ను ప్రొడ్యూసర్ కూతురు కదిలిస్తోంది, నాకు వందల కోట్లున్న సంబంధాలు వస్తున్నాయి అంటున్నావ్.. అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోకూడదు, బిడ్డను కనకూడదు. నన్ను హింస పెట్టాలనే ఆలోచనలో మహేశ్ కుటుంబం ఉంది. మేం మగాళ్లం, ఇదొక ఆడది అనే పాయింట్‌లో ఉన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థ ద్వారా సమస్యను పరిష్కరించాలని నేను ప్రయత్నిస్తున్నాను. అంతేకానీ నా గురించి ఇతను, ఇతని తండ్రి అడ్డమైనవి మాట్లాడుతామంటే నేను కూడా ఎక్కడైనా ధర్నా చేయడానికి రెడీగా ఉన్నానని గౌతమి చెప్పారు

మహేశ్ వెనుక సూపర్‌స్టార్ ఫ్యామిలీ
మంచి విలువలు ఉన్న కుటుంబం నుంచి నేను వచ్చా.. బాగా చదువుకున్నాను, నా లాంటి దాన్నే వీళ్లు హింస పెడుతున్నారంటే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అతని వెనుక ఎవరైనా ఉండనీయండి.. పెద్ద పెద్ద ఫ్యామిలీల పేర్లు చెబుతున్నాడు. నా వెనుక సూపర్‌స్టార్ ఫ్యామిలీ ఉందని అంటున్నాడు. సూపర్‌స్టార్ అంటే మహేశ్ బాబు గారు కాదు. అంత పెద్ద స్టార్స్ ఉన్నారు నా వెనుక అని చెబుతున్నాడు. అంత పెద్ద స్టార్స్ తెలివి లేకుండా ఉండరు, అతనిలో ఎంత న్యాయం ఉంది? ఎంత ధైర్యం ఉంది? అనేది అందరూ తెలుసుకుంటారు. సెలబ్రెటీల భార్యలు ఉన్నారు అంటున్నాడు.. ఎవరున్నా కూడా నాకు లెక్క లేదు. ఎందుకంటే న్యాయం, ధర్మం నా వెనుక ఉన్నాయి. ఆధారాలతో రెడీగా ఉన్నాను? ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడినా సిద్ధంగా ఉన్నాను, నాకైతే న్యాయం కావాలి? అతను నా నుంచి ఏమేం తీసుకున్నాడో అవన్నీ సెటిల్ చేయాలి. నా గురించి చేస్తున్న డ్యామేజ్ ఆగిపోవాలి అని గౌతమి చౌదరి డిమాండ్ చేశారు.

More from Filmibeat

Read more about: gautami Dharma Mahesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X