For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాలుగు గంటల్లో ఆ అమ్మాయి మొహం చూడగలిగానా? లేదా?.. హీరో కార్తీ

  |

  యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...

  యాంగ్రీ హీరో కార్తీ మాట్లాడుతూ - "ఖాకి' సినిమాను మీరు బాగా ఆదరించారు, నేను కొత్త ప్రయోగాలు చేయడానికి ఆ సినిమా ఒక అడ్రెస్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత వస్తోన్న ఆలాంటి మరొక 'రా' సినిమా 'ఖైదీ'. కనకరాజ్ గారు ఈ సినిమాకు ముందు నగరం సినిమా చేశారు. ఈ కథ చెప్పేటప్పుడే ఇదొక కొత్త ఐడియా డెఫినెట్ గా మీకు నచ్చుతుంది ఒకసారి చిన్న లైన్ చెప్తాను వినండి అన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద హాలీవుడ్ యాక్షన్ ఫిలింలా అనిపించింది. వాళ్లు ఊహించిన దాని కంటే బిగ్ హిట్ అవుతుంది అనిపించి ఓకే అన్నాను. ఈ సినిమాలో హీరోయిన్ లేదు, పాటలు లేవు, కామిడీ ట్రాక్ కూడా లేదు అన్నారు అదే ఈ సినిమాకు పెద్ద పబ్లిసిటీ అవబోతుంది మీరు చూడండి అన్నాను. ఈ సినిమా ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది ముఖ్యంగా లారీ మీద లైవ్ యాక్షన్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంతా యంగ్ టీమ్ తో డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

  Hero Karthi about Khaidi movie story

  చాలా కాలం తర్వాత అడివిశేష్ గారిని కలిశాను. మా ఇద్దరిది దాదాపు ఒకే రకమైన జర్నీ. ఇద్దరికి ఇలాంటి సినిమాలంటే ఇష్టం. ఇది కేవలం యాక్షన్ మూవీ కాదు, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది, పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బైటికి వచ్చే ఒక 'ఖైదీ'. అతనికి తను ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. ఒక రాత్రిలో నాలుగు గంటల్లో జరిగే స్టోరీ. ఈ నాలుగు గంటల్లో ఆ అమ్మాయి మొహం చూడగలిగాడా? లేదా ? అనేది మూవీ. ఇదొక మాస్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం. ఇంత పెద్ద టైటిల్ నాకు దొరకడమే చాలా అదృష్టం. టైటిల్‌కి తగ్గట్టు సినిమా కూడా ఉంటుంది. అక్టోబర్25 మూవీ రిలీజ్ అవుతుంది. ఇలాంటి మూవీకి మీ ఫ్యాన్స్ సపోర్ట్ చాలా అవసరం. మీ ఫీడ్ బ్యాక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అన్నారు.

  యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌, మాటలు: రాకేంద్ర మౌళి, తెలుగు రాష్ట్రాల్లోసమర్పణ : శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

  English summary
  Angry Hero Karthi is coming with different action thriller 'Khaidi' Produced by SR Prakash Babu, SR Prabhu, Tiruppur Vivek under Dreamwarrior Pictures in Lokesh Kanakaraj's Direction. The film is getting ready to hit the screens worldwide as Diwali gift. Recently released theatrical trailer is getting rave response from the audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X