Game On వెండితెరపై ఇప్పటి వరకు రాని కథాంశంతో మూవీ.. మధుబాల కీలకపాత్రలో..
టాలీవుడ్‌లో మరో విభిన్నమైన కథాంశంతో మూవీ రాబోతున్నది. యువ హీరో, హీరోయిన్లు తమ ప్రతిభను చాటుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న గేమ్ ఆన్ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయగా ఊహించని రెస్సాన్ వచ్చింది. ఇలా సినీ వర్గాలను, ప్రేక్షకులను ఆకట్టుకొన్న గేమ్ ఆన్ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఆన్. రవి కస్తూరి సమర్పణలో ఇండస్ట్రీకి సుపరిచితులైన కుమార్ బాబు నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. హీరోగా రథం ఫేం గీతానంద్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ మూడవ వారంలో మొదలవుతుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
తన మొదటి సినిమా బాయ్స్‌తో యూత్‌ని ఆకట్టుకునేందుకు దర్శకుడు దయానంద్ సిద్దంగా ఉన్నారు. తాజాగా వెండితెర ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో గేమ్ ఆన్‌ను ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సెట్‌పైకి వెళ్లకుండానే భారీ ఆఫర్‌తో హిందీ రైట్స్ అడగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ సందర్బంగా నిర్మాత కుమార్ బాబు మాట్లాడుతూ.. నాకు తెలిసి ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషన్, లవ్, సెంటిమెంట్స్, ట్విస్టుల మేళవింపుతో రాబోతున్నది. ఈ చిత్రం టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ సినిమాతో గీతానంద్ మంచి హీరోగా నిలబడటమే కాకుండా దర్శకుడిగా దయానంద్ మంచి మార్కులు కొట్టేస్తాడు. మంచి టెక్నీషియన్స్ దొరకడమే కాకుండా ఈ సినిమాకు ఆర్టిస్టులు అందరూ సెట్ అవుతున్నారు. నటి మధుబాల కథలో కీలకమైన తల్లి పాత్రలో కనిపించునున్నారు. కన్నడ కిషోర్, మధుసూదన్ లాంటి ఆర్టిస్టులు ఈ సినిమాకు కరెక్ట్‌గా సెట్ అవుతున్నారు. ఈ సినిమా 2022లో ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.
నటీనటులు: గీతానంద్, కన్నడ కిషోర్, మధుసూదన్ తదితరులు
రచన, దర్శకత్వం: దయానంద్
నిర్మాత: కుమార్ బాబు
సమర్పణ: రవి కస్తూరి
లైన్ ప్రొడ్యూసర్: నికిలేష్ వర్మ
విజువల్స్: కుశేందర్ రమేష్
ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్
సంగీతం: అశ్విన్- అరుణ్
పీఆర్వో: మధు వి ఆర్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంటకేశ్వర క్రియేషన్స్ గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్


Click it and Unblock the Notifications











