For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదంలో మహాసముద్రం రంభ సాంగ్.. ఇంకా కాస్కోండి, దేవుళ్ళకు తాగుబోతులకు పోలికలా?

  |

  తెలుగు సినిమా పాటలను వివాదాలు వెంటాడుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా పాటలు వివాదాల బారిన పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాట విడుదల అయి రెండు రోజులు గడిచిందో లేదో వెంటనే ఈ వివాదం చెలరేగుతోంది. తాజాగా మరో పాట కూడా వివాదం బాట పట్టింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  వరుస వివాదాలు

  వరుస వివాదాలు

  కొద్ది రోజుల క్రితం ఇప్పుడు కాకా ఇంకెప్పుడు అనే సినిమా ట్రైలర్ లో పబ్బుల్లో భజగోవిందం పాట పెట్టారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వ్యవహారంలో హిందూ సంఘాలు ఎంట్రీ ఇవ్వడం తో చివరికి ఆ ట్రైలర్ తొలగించి దర్శకుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత నాగశౌర్య హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న వరుడు కావలెను అనే సినిమాలో దిగు దిగు దిగు నాగ అనే భజన పాట ఒక ఐటెం సాంగ్ లాగా ప్రెజెంట్ చేస్తున్నారు అంటూ ఆ పాట రాసిన అనంత శ్రీరామ్ మొదలు సంగీతం అందించిన తమన్ వరకు అందరినీ టార్గెట్ చేశాయి హిందూ సంఘాలు. అయితే ప్రస్తుతానికి ఆ పాట లిరిక్స్ మారుస్తామని సినిమా యూనిట్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

  హే రంభ రంభ

  హే రంభ రంభ

  అయితే ఇప్పుడు తాజాగా మహాసముద్రం సినిమా కూడా ఈ వివాదంలో చిక్కుకుంది. తాజాగా హే రంభ రంభ అంటూ హీరోయిన్ రంభకి కాంట్రిబ్యూట్ అంటూ యూనిట్ విడుదల చేసిన పాటలో కొన్ని పదాలు హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ఉన్నాయని హిందూ దేవుళ్లను తాగుబోతులను ఒకలాగానే చిత్రీకరిస్తూ ఈ పాట సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సినీనటి స్పందిస్తూ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

  ఇంకా కాస్కోండి

  ఇంకా కాస్కోండి

  పాట రాసిన భాస్కరభట్ల సినిమా దర్శకుడు అజయ్ భూపతి నీ టార్గెట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. ''ఐపాయ్ భాస్కర్ బట్ల గారు కూడా చేరి పోయారా లిస్ట్ లో.. కృష్ణుడు గోవర్ధన గిరి ఎత్తాడు హనుమంతుడు సంజీవని ఎత్తు కొచ్చాడు వాళ్ళు గొప్పోళ్ళు మనం కనీసం సీసాలు ఎత్తలేమా.. ఇది పాట పురాణపురుషుల తో తాగుబోతులను పోలుస్తూ రచనలు చేస్తున్న RX 100 దర్శకుడు... మీకు మాటలతో అర్థం కాదా ఇంకా కాస్కోండి...మహాసముద్రం టీమ్ కీ హేచ్చరిక మార్చుకుంటే రంగంలో. దిగుతా..... జై శ్రీరామ్ అని హెచ్చరించారు.

  కుదేశాడు అని రాసుకొమ్మనండి

  కుదేశాడు అని రాసుకొమ్మనండి


  అయితే పాట పూర్తిగా విన్నారా?వాళ్లంత గొప్పోల్లం కాదు గానీ అని సాగుతోంది ఎందుకండి హిందూ మతాన్ని చెడగొడతాడు హిందుత్వమంటే ఎవరిని ఎలాగైనా పూజించుకోమనే ఉదాత్త భావన, ఎడారి మతాల్లా ఒకరిని ఇలాగే పూజించాలి అనే మతం కాదు.. ఇది ధర్మం మీ లాంటోళ్లు నవ్వులపాలు చేయడానికి చీడపురుగుల్లా తయారయ్యారు అని ఒకరి కామెంట్ చేయగా దానికి కరాటే కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోడి రామ్మూర్తి కొండల్ని పిండి చేసాడు మహమ్మద్ అలీ మనుషుల్ని ఎత్తి కుదేశాడు అని రాసుకొమ్మనండి ఎవరు వద్దన్నారు గోవర్ధన గిరి, సంజీవని పర్వతం..మందు సీసాలు ఒకటేనా...మీరు పూర్తిగా విన్నారా.. రెండవ చరణం లో దేవుళ్లకు తాగుబోతులకు పోలికలు.... నేను కాదు మీ లాంటోళ్లు చీడ చదపురుగులు... ఏది పడితే అది రాస్తే ఇక్కడ ఊరుకోరు తుప్పు వదిలిస్తా.. అయినా తాగుబోతు పాటలో దేవుళ్ళు ఎందుకు వచ్చారు ? ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ పెట్టాను గొప్పగా మాట్లాడా అని మురిసిపోకు.. నీ కన్నా బాగా మాట్లాడగలను అని కామెంట్ చేయగా తప్పు ఎక్కడున్నా. తప్పే. ఒక తాగుబోతులకు అది తప్పు. అనిపించదు మరి నీవ్వెంటో నాకు తెలియదని అన్నారు.

  పొలిటికల్ ఎంట్రీ


  ఇక ఎట్టకేలకు తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ ఆమె కొద్ది సేపటి క్రితం తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. " జైశ్రీరామ్ ఆగస్టు 15న నా శుభ ముహూర్తం కాషాయ దళం లోకి , మీ ఆశీస్సులు కోరుతూ భారత్ మాతాకీ జై" అంటూ ఆమె పోస్ట్ చేశారు. కాషాయ దళం లోకి అనగానే బిజెపిలో చేరుతున్నారా అంటూ ఆమెకు పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చి పడగా అవునని తాను బీజేపీలోనే చేరుతున్నానని ఆమె వెల్లడించారు. ఇక ఇప్పుడు కాక ఇంకెప్పుడు వ్యవహరంలో కరాటే కళ్యాణి సినిమా యూనిట్ కి అండగా నిలవడం గమనార్హం. ''ఇది చూడండి ఇంత బహిరంగ క్షమాపణ అడిగినా వీళ్లు కేసులు వేస్తారు. పొద్దున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాల్ చేసి అందరికీ సారీ అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా మనకు వాళ్ళు విలువ ఇచ్చారు. అది కాపాడాలి. లేదా నేను ఏంటో చెప్పను చూపిస్తా. నిన్న వచ్చి సహకరించిన హిందువులు అందరికీ అభినందనలు. ఇది అందరి విజయం. నేను అరుస్తా అవసరం అయినప్పుడు మాత్రమే.. లేదా కార్యాసాదకురాలిగా ఉంటా.. జై శ్రీరామ్ జయ జయ శంకర'' అని అంటూ తన ఫేస్ బుక్ లో ఆమె పేర్కొంది.

  English summary
  Controversy haunts Telugu movie songs. It is a matter of concern that the songs in the last few days in a row have been plagued by controversy. The latest song, from Maha Samudram Hey Rambha Rambha, has also been the subject of controversy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X