Samantha Ruth Prabhu యశోద మూవీకి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఉత్కంఠకు గురిచేసే యాక్షన్ ఎపిసోడ్స్

కమర్షియల్ విలువలు, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకొంటూ దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు దూసుకెళ్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవ్వడంతో వెంటనే యశోద సినిమాను అంగీకరించారు. సమంత ఇంతకు ముందు చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు భిన్నంగా రూపొదిద్దుకొంటున్న చిత్రం యశోద. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా భారీగా స్కోప్ ఉండటంతో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీయడం విశేషంగా మారింది.

దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ద ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో ఉత్కంఠకు గురిచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో 'యశోద' ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పెర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజులపాటు యశోద యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు.

 Hollywood Stunt Choreographer Yannick Ben to design fights for Samanthas Yashoda movie

హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత తదితరులపై పది రోజుల పాటు మూడు సెట్స్‌లో షూటింగ్ చేశాం. సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రమిది" అని చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X