కరోనావైరస్ లాక్‌డౌన్ కాలంలో సినిమాల విడుదల నిలిచిపోయిన నేపథ్యంలో 2020 సంవత్సరంలో ఓటీటీలో సందడి చేసిన టాప్ 10 వెబ్ సిరీస్ జాబితాను IMDb సంస్థ విడుదల చేసింది. యూజర్ రేటింగ్స్ ప్రకారం జాబితాను పొందుపరిచినట్టు సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు కోల్ నీదామ్ వెల్లడించారు. ఈ సందర్భంగా కోల్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వెబ్ సిరీస్లపై సినీ అభిమానులు, ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. తమకు నచ్చిన వెబ్ సీరీస్‌కు రేటింగ్ ఇవ్వడానికి IMDbని ఎంచుకోవడం ఆనందంగా ఉంది. IMDbలో యూజర్ ఇచ్చిన రేటింగ్ ప్రకారం.. స్కామ్ 1992: ది హర్షద్ మెహతాకు అనూహ్యమైన ఆదరణ లభించింది. ఆల్‌టైం జాబితాలో టాప్ 250లో స్కామ్ 1992 మొదటి స్థానంలో నిలిచింది అని కోల్ పేర్కొన్నారు.
2020లో టాప్ రేటింగ్ సాధించిన వెబ్ సిరీస్ జాబితా ఇలా ఉంది..
1. స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరి
2. పంచాయత్
3. స్పెషల్ ఓపీఎస్
4. బాండిష్ బాండిట్స్
5. మీర్జాపూర్
6. అసుర్: వెల్‌కం టూ యూవర్ డార్క్ సైడ్
7. పాతాల్ లోక్
8. హై
9. అభయ్
10. ఆర్య
టాప్ 10లో నిలిచిన వెబ్ సిరీస్‌లో స్కామ్ 1992, మీర్జాపూర్, పాతాళ్ లోక్, అభయ్, ఆర్య లాంటి వెబ్ సిరీస్‌కు అమెజాన్, ఇతర ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో అత్యంత ప్రేక్షకాదరణ లభించిన సంగతి తెలిసిందే.
IMDb సంస్థ విషయానికి వస్తే.. అమెజాన్ కంపెనీకి సంబంధించిన మూవీ రేటింగ్ సంస్థ. టీవీ షోస్, సెలబ్రిటీల గురించిన సమాచారాన్ని అందిస్తున్నది. ఇంటర్నెట్ మాధ్యమంలో అన్ని రకాల ఫ్లాట్‌ఫాంపై ఈ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది.
IMDb Top 10 Indian Web Series of 2020: Worldwide interest in Indian streaming series hit an all-time high this year, and fans once again turned to IMDb to rate their favorites and help others discover these breakout shows,” said Col Needham, IMDb Founder and CEO. “In fact, our #1 user-rated Indian web series of this year, Scam 1992: The Harshad Mehta Story, has been so popular that it landed a top spot on the IMDb list of the Top 250 TV Series of all-time.”