Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
F3 మూవీ లేటెస్ట్ అప్డేట్.. అసలు కథ ఇదన్నమాట!
సంక్రాంతి ఫెస్టివల్స్ లలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో F2 ఒకటి. సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్ వారి కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా.. మరోసారి కలిసి నటించడానికి రెడీ అయ్యారు. ఈ సారి అంతకంటే హై రేంజ్ లో నవ్వించాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సారి వారితో మరో హీరో కూడా జాయిన్ కాబోతున్నాడు. లాక్ డౌన్ లోనే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ లీక్ అయినట్లు తెలుస్తోంది. F2 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇపుడు F3 అంటే వాటితో పాటు ఫ్యామిలీ అనే పాయింట్ ని జత చేసినట్లు తెలుస్తోంది. మరో ఎఫ్ అంటే ఫ్యామిలీ అని అర్థమట. భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న సరదా సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ మొత్తంలో ఉండే సరదా సన్నివేశాలను కూడా దర్శకుడు తనదైన శైలిలో చూపించబోతున్నాడట.

ఉమ్మడి కుటుంబం అనే కాకుండా చిన్న తరహా కుటుంబల్లో నిత్యం జరిగే కామెడీ యాంగిల్స్ ని హైలెట్ చేసి నవ్వించడానికి రెడీ అయినట్లు టాక్. మరి ఈ సారి అనిల్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక సినిమాలో మరొక హీరో ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నప్పటికి ఇంకా దర్శకుడు కూడా వివరణ ఇవ్వలేదు. అయితే జనవరి అనంతరం మాత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.