For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Seetimaarr మూవీలో హైలైట్ ఎపిసోడ్ అదే: ఆ పది నిమిషాలు గూస్‌బమ్స్ ఖాయమట

  |

  కావాల్సినంత టాలెంట్ ఉన్నా కథల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రతికూల ఫలితాలు వస్తూనే ఉంటాయి. సినిమా కోసం ఎంత కష్టపడినా ఫీల్ మిస్ అయితే నిరాశనే ఎదుర్కోవల్సి వస్తుంది. ఇదే విధంగా కెరీర్ ఆరంభం నుంచీ కష్టాలు పడుతూనే ఉన్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్. మొదటి నుంచీ కమర్షియల్ చిత్రాల్లోనే నటించిన అతడు.. ఆరంభంలో కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలా కాలంగా ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే పంథాను మార్చుకున్నా ఫలితం మాత్రం అనుకున్న విధంగా రావడం లేదు. దీంతో మళ్లీ పాత ఫార్ములానే ఫాలో అవుతున్నాడు.

  రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!

  ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న గోపీచంద్.. సంపత్ నంది దర్శకత్వంలో నటించిన చిత్రం 'సీటీమార్'. కుటుంబ కథకు కమర్షియల్ హంగులు జోడించి తెరకెక్కించిన ఈ చిత్రంలో కబడ్డీ గేమ్‌ను హైలైట్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందులోనూ ఈ చిత్రంలో గోపీచంద్ తన కెరీర్‌లోనే తొలిసారి భారీ స్థాయిలో పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అతడి లుక్స్‌ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచేశాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  Interval Bang Highlight in Gopichands Seetimaarr​ Movie

  కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఈ క్రమంలోనే చాలా రోజులుగా విడుదలకు సిద్ధంగానే ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సందేహాల నడుమ ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, ఆ వెంటనే దీన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  'సీటీమార్' మూవీ విడుదలకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో దీన్ని అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉంటుందట. ఆ సమయంలో వచ్చే పది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బమ్స్ తెప్పించే విధంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. మొత్తంగా ఓ భారీ ట్విస్ట్‌తో సాగే ఈ సీన్ ప్రేక్షకులతో సీటీ కొట్టించేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

  భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'సీటీమార్‌' మూవీలో గోపీచంద్‌, తమన్నా రెండు కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

  English summary
  Tollywood Talented Hero Gopichand Now Doing Seetimaarr Movie Under Sampath Nandi Direction. Interval Bang Highlight in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X