Hijab తొలగించి నిరసన.. యువ హీరోయిన్ అరెస్ట్!

ఇరాన్‌లో మహిళలపై కొనసాగుతున్న దాడులు, వస్త్రధారణ, తలకట్టు వస్త్రధారణపై విధిస్తున్న అంక్షలను నిరసించిన నటిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం అత్యంత వివాదాస్పదమైంది. కొద్ది నెలల క్రితం తలకట్టు వస్త్రధారణ (హిజబ) తీసివేశారని 22 ఏళ్ల మక కుర్దీష్ మహిళ మహస అమినీని మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె కస్టడీలో ఉండగానే మరణించడంతో ఇరాన్‌లో భారీగా మహిళా ఉద్యమం లేచింది.

మహిళా ఉద్యమానికి మద్దతుగా ఇరాన్ నటి తన జుట్టుపై ఉండే హిజబ్‌ను తొలగించి.. తన కేశాలను బహిర్గతం చేసింది. ఇరాన్ నటి జుట్టు విరబూసుకొని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ముస్లిం సంప్రదాయాన్ని తుంగలో తొక్కారనే ఆరోపణలతో ఇరాన్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది.

Iranian Actress arrested who removes Hijab at Shopping Street

ఇరాన్ నటి.. తన వీడియోలో.. జనసమర్ధమైన షాపింగ్ స్ట్రీట్‌లో తలకు ఉన్న హిజబ్‌ను తొలగించి.. జుట్టును బయటకు తీసింది. తన జుట్టుకు ఓ రింగ్ తొడిగి పోనిటెయిల్‌గా మలుచుకొన్నది.ఈ వీడియోను ఇరాన్ నటి పోస్టు చేయగానే.. సోషల్ మీడియాలో వైరల్ అయింది..

ఇరాన్‌లో జరుగుతున్న మహిళా ఉద్యమాన్ని కల్లోలంగా అభివర్ణించింది. పాశ్చాత్య సంస్కృతితో ముస్లిం సంప్రదాయాన్ని గాలికి వదులుతున్నారు అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

తన అరెస్ట్‌కు సమన్లు జారీ చేశారని కొద్ది రోజుల క్రితం ఇరాన్ నటి మీడియాకు వెళ్లడించింది. ఈ క్షణం నుంచి నాకు ఏమైనా సరే.. నేను ఇరాన్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకొంటాను. నా చివరి శ్వాస వరకు నేను ప్రభుత్వ ఆంక్షలను వ్యతిరేకిస్తా.మహిళా ఉద్యయానికి అండగా నిలుస్తానని ఇరాన్ నటి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X