Akhanda ఓటీటీలో రిలీజ్.. బాలకృష్ణ మూవీ ఏ రోజు? ఎక్కడ రిలీజ్ అవుతుందంటే?

కరోనావైరస్, ఏపీలో టికెట్ల రేట్ల వివాదం మధ్య విడుదలైన అఖండ చిత్రం ఎవరూ ఊహించని కలెక్షన్లను సాధిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 5 వారాలుగా కొత్త సినిమాలకు ధీటుగా థియేటర్లలో ఎదురు లేకుండా దూసుకెళ్తున్నది. భారీ కలెక్షన్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ఏ ఓటీటిలో రిలీజ్ అవుతున్నది? ఏ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నదనే వివరాల్లోకి వెళితే..

 విభిన్నమైన కథతో

విభిన్నమైన కథతో

బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం అనేక వివాదాల మధ్య డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందుత్వం, అఘోరా కథానేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు తొలి ఆట నుంచే బ్రహ్మరథం పట్టారు. దాంతో భారీ వసూళ్లను నమోదు చేసింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్

బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్

ఇప్పటి వరకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్టే ప్రేక్షకులను మెప్పించింది. దాంతో అఖండకు యునానిమస్ టాక్ సొంతం చేసుకొని రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయం నమోదైంది.

2021లో అత్యధిక వసూళ్లు

2021లో అత్యధిక వసూళ్లు

అఖండ చిత్రం 2021లో రిలీజైన అన్ని చిత్రాల కంటే భారీ వసూళ్లను సాధించిన తెలుగు చిత్రంగా మరో రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ సినిమా 32 రోజుల్లో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వసూళ్లను అధిగమించింది. నైజాం, ఆంధ్రాలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. వకీల్ సాబ్ సినిమా 131 కోట్ల గ్రాస్, 81.7 కోట్ల నెట్ వసూళ్లను రాబడితే.. అఖండ చిత్రం 137 కోట్ల గ్రాస్, 86 కోట్ల నికర కలెక్షన్లను నమోదు చేయడం రికార్డుగా చెప్పుకోవచ్చు.

డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్

డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్


అఖండ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం 20 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిన చిత్రాల్లో అఖండ ఒకటిగా నిలిచింది.

Recommended Video

Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
జనవరి 14న ఓటీటీ రిలీజ్అంటూ..

జనవరి 14న ఓటీటీ రిలీజ్అంటూ..

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత అర్ధ శతదినోత్సవానికి పరుగులు పెడుతున్న అఖండ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. డిస్నీ+హాట్ స్టార్‌తో ఒప్పందం ప్రకారం ఈ సినిమాను 30 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. దాంతో అఖండను జనవరి 14వ తేదీన డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ కానున్నదనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X