నయనతార మూవీకి రికార్డు స్థాయి బిజినెస్.. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేతతో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఎన్నో రోజులుగా సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న నయనతార చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రౌడీ బ్యానర్‌పై తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన నేత్రికన్ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ అవుతుందనే వార్త తమిళ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే...
నేత్రికన్ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేసింది. ప్రమోషన్‌లో భాగంగా కార్తీక్ నేత రాసిన మొదటి పాటను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందనను కూడగట్టుకొన్నది. ఈ పాటను సిద్ శ్రీరాం పాడగా సంగీత ప్రియులు విశేషంగా ఆకర్షించింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

నేత్రికన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ చేజిక్కించుకొన్నది. ఈ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో రూ.15 కోట్లకు అమ్ముడుపోయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌పై అధికార ప్రకటన రానున్నది. ఈ సినిమాను జూలైలో డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
నేత్రికన్ చిత్రానికి మిలింద్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజ్మల్, మణికందన్, సరన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫిని అందించగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











