Don't Miss!
- Sports
INDvsNZ : రాంచీలో టీమిండియా లాస్ట్ ఆడిన టీ20.. ఆ మ్యాచ్ ఫలితం ఏంటి?
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- News
షార్ట్‌కట్స్ వద్దు! ‘యావరేజ్’ అద్భుతాలు సృష్టిస్తుంది: పరీక్షాపే చర్చలో ప్రధాని మోడీ
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Technology
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Deepika Padukone పఠాన్ ట్రైలర్ సోషల్ మీడియాలో లీక్.. రిలీజ్‌కు ముందే షారుక్‌కు షాక్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం రిలీజ్‌కు ముందే వివాదాల్లో కూరుకుపోయింది. ఈ సినిమాలోని పాటలపై అభ్యంతరం వ్యక్తం కావడం, అశ్లీల సన్నివేశాలపై కొన్ని వర్గాలు భగ్గుమనడంతో పఠాన్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అయితే ఈ సినిమాపై నిరసనల సెగలు ఆగలేదు. షారుక్ ఖాన్‌పై ట్రోలింగ్ ఆగలేదు. దాంతో ఈ చిత్రం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఈ సినిమా ట్రైలర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా వివాదాలు, ట్రైలర్ రిలీజ్, లీక్ వివరాల్లోకి వెళితే..

బేషరమ్ రంగ్ పాట వివాదాస్పదంగా
పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాట అత్యంత వివాదాస్పదమైంది. దీపిక పదుకోన్, షారుక్ ఖాన్ చేసిన శృంగార విన్యాసాలపై చాలా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆ పాటలో దీపిక అందాల ఆరబోతపై హిందుత్వ వాదులు భగ్గుమంటున్నారు. అశ్లీల, అసభ్యతతో కూడిన పాట పిల్లలపై దుష్ప్రభావం చూపుతుందని కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిరసన
పఠాన్ సినిమాపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పఠాన్ సినిమాలోని బేషరమ్ రంగ్ పాటకు సంబంధించిన పోస్టర్లు, వీడియో క్లిప్పింగులు, ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. యువతను పెడదోవ పట్టించే విధంగా ఆ పాట ఉందని తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. జువనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.

దీపిక పదుకోన్ బికినీ సీన్లు తొలగించాలి
బేషరమ్ రంగ్ సాంగ్‌పై శక్తిమాన్ ఫేమ్, మాజీ సెన్సార్ బోర్డు చైర్మన్ ముఖేష్ ఖన్నా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీపిక పదుకోన్ బికినీ సీన్లను సినిమా నుంచి తొలగించాలి. పాటల అశ్లీలతను తగ్గించాలి. సినిమా రిలీజ్‌కు చాలా మార్పులు చేసి.. మూవీని సెన్సార్ బోర్డు పున:పరీశీలనకు యూనిట్ పంపాలి. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

సెన్సార్ బోర్డు స్పందించకపోతే..
పఠాన్ మూవీ, సినిమాలోని పాటలు హిందువుల మనోభావాలకు దెబ్బ తీసేలా ఉన్నాయి. ఈ సినిమాపై సెన్సార్ బోర్డు తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సెన్సార్ బోర్డు స్పందించకపోతే.. హిందూ సంస్థలు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలి. సినిమాలోని దీపిక పదుకోన్ బికినీ డ్రస్ ధరించిన సన్నివేశాలను తొలగించాలి అని ముఖేష్ ఖన్నా డిమాండ్ చేశారు.
|
సోషల్ మీడియాలో పఠాన్ ట్రైలర్ లీక్
పఠాన్ సినిమాపై వివాదాలు ఒకవైపు కొనసాగుతుండగా. షారుక్ ఖాన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పఠాన్ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషలకు చెందిన ట్రైలర్‌ను జనవరి 10వ తేదీన 11 గంటలకు బిగ్‌స్క్రీన్లలో ప్రదర్శించడం ద్వారా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నది.