For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vijay Deverakonda శివ నిర్వాణ మూవీ వైభవంగా ప్రారంభం.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ టైటిల్‌‌తో?

  |

  టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ అతి కొద్ది సంవత్సరాల్లోనే ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకొన్నారు. వరుసగా రెండు ప్యాన్ ఇండియా మూవీస్ లైగర్, జనగణమన చిత్రాలను లైన్లో పెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే సినిమా హైదరాబాద్‌లో గురువారం వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రారంభ వేడుక వివరాల్లోకి వెళితే..

  హరీష్ శంకర్, బుచ్చిబాబు చేతుల మీదుగా

  హరీష్ శంకర్, బుచ్చిబాబు చేతుల మీదుగా

  విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రానున్న ఇంకా పేరు పెట్టని చిత్రానకిి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ ఇచ్చారు. ఉప్పెనతో సంచలన దర్శకుడిగా మారిన బుచ్చిబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందే ఈ మూవీ స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు.

   మైత్రీ మూవీస్‌లో విజయ్ దేవరకొండ రెండోసారి

  మైత్రీ మూవీస్‌లో విజయ్ దేవరకొండ రెండోసారి


  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ నటించడం ఇది రెండోసారి. గతంలో డియర్ కామ్రేడ్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. రంగస్థలం తర్వాత మరోసారి ఈ బ్యానర్‌లో సమంత నటించడం విశేషంగా మారింది. సమంత నటించిన చిత్రాలు శాకుతలం, యశోద, విజయ్ సేతుపతి, నయనతారతో మరో చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి.

  సమంత, విజయ్ దేవరకొండ మరోసారి

  సమంత, విజయ్ దేవరకొండ మరోసారి

  విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించడం ఇది రెండోసారి. మహానటి చిత్రంలో విజయ్, సమంత జంటకు మంచి మార్కులు వేశారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొత్తగా కనిపించింది. అయితే అదే మ్యాజిక్ తాజా చిత్రంలో రిపీట్ చేసేందుకు శివ నిర్వాణ సిద్దమైనట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాను కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలిసింది.

  ఖుషీ టైటిల్ పరిశీలనలో

  ఖుషీ టైటిల్ పరిశీలనలో

  అయితే విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖుషీ టైటిల్‌ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ కావడంతో ఖుషి గురించి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఖుషీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

   నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
  నిర్మాతలు : నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి
  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి
  మ్యూజిక్ డైరెక్టర్: హిషామ్ అబ్దుల్ వాహబ్ (హృదయం ఫేమ్)
  ఎడిటర్ : ప్రవీణ్ పూడి
  ఫైట్స్: పీటర్ హెయిన్
  మేకప్: బాషా
  కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
  ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక
  ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
  రచనా సహకారం: నరేష్ బాబు పి
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
  పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
  సీఈవో: చెర్రీ

  English summary
  Tollywood is set to witness another stellar combination. Tollywood heartthrob Vijay Deverakonda, successful director Shiva Nirvana, and star actress Samantha are set to come together for a family entertainer. The film was launched in a grand manner on Thursday. At the launch event, the first clap is sounded by Harish Shankar, the camera is switched on by Buchi Babu Sana, the script is handed over by Mythri producers to Shiva Njrvana. The first shot is directed by Shiva Nirvana.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X