Don't Miss!
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Raju Yadav Teaser: గెటప్ శ్రీనుకు హీరోయిన్ లిప్ కిస్.. రాజు యాదవ్ విశ్వరూపం
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో జబర్ధస్త్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు పదేళ్లుగా టెలివిజన్ రంగంలో ఈ షో హవాను చూపిస్తుండడమే దీనికి ప్రధానమైన కారణం. అంతేకాదు, ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో కొందరు తమలోని నైపుణ్యాలను బయట పెట్టి సక్సెస్ అయ్యారు. వారిలో చాలా మంది సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన వారిలో గెటప్ శ్రీను ఒకడు. గెటప్‌ల స్పెషలిస్టుగా పేరొందిన అతడు సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్నాడు.
యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!
అద్భుతమైన టాలెంట్‌తో ఎంతో కాలంగా బుల్లితెరపై ఆకట్టుకుంటున్న గెటప్ శ్రీను భారీ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు హీరోగా మారి 'రాజు యాదవ్' సినిమాను చేస్తున్నాడు. 'నీది నాది ఒకే కథ', 'విరాటపర్వం' చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంకిత కరత్ హీరోయిన్‌గా చేస్తోంది. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది.

గెటప్ శ్రీను హీరోగా నటిస్తోన్న 'రాజు యాదవ్' మూవీ నుంచి సంక్రాంతి కానుకగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో క్రికెట్ ఆడుతుండగా పెదాలకు దెబ్బ తగిలి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా హీరో ముఖం తయారవుతుంది. అలాంటి అతడి జీవితంలోకి హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని గొడవలు వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఇందులో గెటప్ శ్రీను తనదైన నటనతో విశ్వరూపం చూపించాడు. అంతేకాదు, ఇక, ఈ వీడియో చివర్లో హీరోయిన్ అతడికి లిప్ కిస్ ఇవ్వడాన్ని చూపించారు. దీంతో ఈ టీజర్ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.
నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!
జబర్ధస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'రాజు యాదవ్'. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వరుణ్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, సన్నీ, సంతోష్ తదితరులు కీలక పాత్రలను చేస్తోన్నారు.