For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొలిటికల్ జోకర్లు.. ప్రకాశ్ రాజ్ ఎలా ఓడాడు? మెగా ఫ్యామిలీపై విరుచుకుపడ్డ రోజా

  |

  మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజుల క్రితం ప్రజలకు మెగా హీరోలు ఏమీ చేయలేదు. కాబట్టే ఆ ముగ్గురు అన్నదమ్ములను సొంత ఊర్లోనే ప్రజలు ఓడించారు. వారి వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు అని రోజా చేసిన వ్యాఖ్యలకు ఇటీవల నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పారు. అయితే ఇటీవల రోజాపై కొందరు జబర్దస్త్ కమెడియన్లు చేసిన వ్యాఖ్యలపై రోజా తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ..

  పొలిటికల్ జోకర్లు చేసే కామెంట్లకు..

  పొలిటికల్ జోకర్లు చేసే కామెంట్లకు..

  పొలిటికల్ జోకర్లు చేసే కామెంట్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వారు చేసే వ్యాఖ్యలను వారి ఇంట్లో వాళ్లే పట్టించుకోరు. యూట్యూబ్‌లో చూస్తే నాపై కామెంట్లు చేసే వారిని చూస్తే.. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ వీడియోలను నాకు కొందరు పంపిస్తారు. నీ గురించి ఇలా అంటున్నారు అని నాకు చెబితే.. ఒక అమ్మా.. అబ్బకు పుడితే.. అలా మాట్లాడరు అని నా అభిమానులకు, కార్యకర్తలకు సర్ది చెప్పుకొంటాను అని రోజా చెప్పారు.

  చీప్ పాలిటిక్స్ పనికి రావు అంటూ

  చీప్ పాలిటిక్స్ పనికి రావు అంటూ


  రాజకీయ అవగాహన లేని కొందరు నాపై అర్ధంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నాం.. ఏం చేస్తామో మేము చెబుతాం. వాళ్లు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఒకరిపై బురదజల్లే చీప్ పాలిటిక్స్ సరికావు. రోజా నీవు టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ 18 స్థానానికి పడిపోయింది. నీవు మంత్రి బాధ్యతలు వదిలేసేటప్పుడు 20 స్థానానికి పడిపోతుందని చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని రోజా అన్నారు.

  పిల్లి బిత్తిరి గాళ్లు అంటూ రోజా

  పిల్లి బిత్తిరి గాళ్లు అంటూ రోజా


  నాపై విమర్శలు చేసేవారు పిల్లిబిత్తిరి గాళ్లు. వారి జీవితాలు ఎంత? వాళ్లు చిన్న చిన్న ఆర్టిస్టులు.. వారు చిన్నచిన్న షోలు చేసుకొంటూ బతుకుతున్నారు. అలాంటి వారితో మెగా హీరోలు తిట్టిస్తున్నారు. మీకు తెలుసు మెగా ఫ్యామిలీలో ఆరుగురు ఏడుగురు హీరోలు ఉన్నారు. వారు నటించే సినిమాల్లో అవకాశాలు రావని వారు నన్ను తిడుతుంటారు. వాళ్ల గురించి ఆలోచిస్తే అంతకంటే టైమ్ వేస్ట్. వారితో మాట్లాడిస్తున్న వారు ఎవరో మీకు తెలుసు అని అన్నారు.

  ప్రకాశ్ రాజ్ ఎందుకు గెలువలేదు

  ప్రకాశ్ రాజ్ ఎందుకు గెలువలేదు


  మెగా ఫ్యామిలీపై సినీ పరిశ్రమలో ప్రేమ ఉంటే.. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఎందుకు గెలువలేదు. ప్రకాశ్ రాజ్‌కు మెగా హీరోలు మద్దతు తెలియజేస్తే వారికి ఓట్లు ఎందుకు వేయలేదు. అభిమానం వేరు. బలం వేరు. ఒక్కసారి ఆలోచించండి మెగా ఫ్యామిలికి ఉన్న బలమేమిటో అని రోజా విమర్శలు చేశారు. ఒకవేళ బలం ఉంటే.. ఒకరు సీఎం అయిపోయి ఉండాల్సింది. ఒకరు మరొకరు సీఎం రేసులో ఉండాలి. ప్రజలు చాలా తెలివిగల వారు. ఎవరిని అందలం ఎక్కించాలో.. ఎవరిని దించాలో ప్రజలకు బాగా తెలుసు అని రోజా దెప్పిపొడిచారు.

  సినిమా పరిశ్రమపై మెగాకు పట్టులేదు

  సినిమా పరిశ్రమపై మెగాకు పట్టులేదు


  సినీ పరిశ్రమ నుంచి వచ్చిన కోట శ్రీనివాసరావు, శారద, బాబు మోహన్, విజయశాంతి, నేను పోటీ చేసి గెలిచాను. కానీ ఆ ముగ్గురు మెగా హీరోలు ఎందుకు గెలువలేదు. స్టేజీలు ఎక్కి పిచ్చి పిచ్చిగా వాగితే.. ప్రజలు గెలిపిస్తారా? మెగా హీరోలకు సినిమా పరిశ్రమలో బలం లేదు. అవకాశాలు రావని చిన్న చిన్న ఆర్టిస్టులు భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఉన్న బలాన్ని కూడా కోల్పోతారు అని రోజా విమర్శించారు.

  అన్‌స్టాపబుల్ షోకు ఎందుకు వెళ్లలేదంటే?

  అన్‌స్టాపబుల్ షోకు ఎందుకు వెళ్లలేదంటే?


  బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని అనుకొన్నాను. కానీ ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందుకే ఆ షోకు వెళ్లలేకపోయాను. బాలయ్య బాబుతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనతో ఏడు సినిమాలు చేశాను. అయితే చంద్రబాబు ఆ షోకు వెళ్లిన తర్వాత నేను ఇక వెళ్లాలనే ఆలోచనను మానుకొన్నాను అని రోజా అన్నారు.

  English summary
  Actress and YSRCP Roja attacks on Mega family once again. She said, Mega family has no strength in film Industry. So that they do not have domination in the Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X