Don't Miss!
- News
`ఆ మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది`- మెగాస్టార్..!!
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Rajamannar in Salaar.. క్రూరంగా, అతి భయంకరంగా జగపతి బాబు.. లేటేస్ట్ లుక్ ట్రెండింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రం షూటింగు దశలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు, విశేషాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను, సినీ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న జగపతి బాబు పాత్రను రివీల్ చేయడంతో సలార్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ట్రెండ్ అవుతున్న సలార్, జగపతి బాబు లుక్ గురించి వివరాల్లోకి వెళితే..

సలార్ మూవీ ట్రెండింగ్‌గా
సలార్ చిత్రాన్ని ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఏ ముహుర్తానో మొదలుపెట్టారో గానీ.. ఈ సినిమా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌గానే ఉంటుంది. సినిమా పోస్టర్లు, షూటింగుకు సంబంధించిన స్టిల్స్ మీడియాలోను, సోషల్ మీడియాలోను ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. దాంతో ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్‌లో క్రేజీ ప్రాజెక్టుగా మారింది.

దేశంలోనే మాస్ హీరో ప్రభాస్
ఇదిలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ గురించి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇండియా వైడ్‌గా ఈ చిత్రం థియేటర్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మాస్ చిత్రంగా మారబోతుంది. దేశ సినీ పరిశ్రమలో చరిత్రను తిరగరాయడం గ్యారెంటీ.
ప్రభాస్‌ను ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేయడం సరికొత్తగా ఉంటుంది. ప్రభాస్‌ను మించిన మాస్ హీరో ఎవరుంటారు. ప్రభాస్ సినిమా రిలీజ్ కావడం లేట్ అయినా ఫ్యాన్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ ఉంటుంది. బాక్సాఫీస్‌ను తరిమి తరిమి కొట్టడం పక్కా అంటూ అభిమానులు జోష్ మునిగోపతున్నారు.

ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ
అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ తొలి సినిమా కన్నడ చిత్రం ఉగ్రం చిత్రానికి రీమేక్‌గా సలార్ వస్తుందనే వార్త మీడియాలో గత కొద్దికాలంగా వైరల్ అవుతున్నది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి కామెంట్ చేయలేదు. తమ పనిని తాము చేసుకొంటూ ముందుకెళ్తున్నారు. ఇంతకు ఉగ్రం మూవీకి రీమేకా లేదా అనేది పక్కన పెడితే.. ఈ సినిమాను ఏప్రిల్ 14, 2022లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అనే భావన కలుగుతున్నది
|
క్రూరమైన పాత్రలో జగపతి బాబు
ఇలాంటి పరిస్థితుల్లో సలార్ మూవీలోని పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో రాజా మనార్ పాత్రను తాజాగా హోంబలే ఫిల్మ్స్ పరిచయం చేసింది. క్రూరమైన గెటప్‌తో కనిపిస్తున్న పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు అంటూ చిత్ర యూనిట్ ఫోటోను రిలీజ్ చేసింది. నోట్లో చుట్ట.. ముక్కుకు రింగ్ పెట్టుకొని ముడతలు పడిన ముఖంతో జగపతి బాబు భయంకరంగా కనిపించారు.
ఈ ఫోటో ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది. సలార్ చిత్రంలో జగపతి బాబు రాజమనార్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇది. సలార్‌లో జగపతి బాబు భాగమయ్యారు అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.
Recommended Video

ఏప్రిల్ 14, 2022 తేదీన రిలీజ్ అవుతుందా?
సలార్ చిత్ర విశేషాలకు వస్తే.. ఏప్రిల్ 14, 2022 తేదీన రిలీజ్ కాబోయే ఈ మూవీ రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జనవరి 16న లాంఛనంగా ప్రారంభమైన ఈచిత్రం తెలంగాణలోని గోదావరిఖనిలో కొన్నిరోజులు షూటింగ్ జరుపుకొన్నది.
ఈ చిత్రానికి రవి బాస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫిని అందిస్తున్్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌తోపాటు మధు గురుస్వామి, జగపతి బాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు.