NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. న్యూ ఇయర్‌కు షాకయ్యే గిఫ్ట్

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను, ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న తారక్.. ఈ ఏడాది వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగి సత్తా చాటాడు.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు ప్రాజెక్టులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీ ఒకటి. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న ఈ మూవీ అనుకున్న సమయానికి మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల వేట మొదలెట్టడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేశారు.

Jr NTR and Koratala Movie Intro Video Release On New Year

సూపర్ హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న దానిపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఓ సర్‌ప్రైజ్ కూడా రివీల్ అయింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కబోతుందట. అయితే, ఈ ఆలస్యాన్ని భర్తీ చేయడం కోసం న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం నుంచి తారక్ పరిచయ వీడియోను విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటికే అతడిపై తీసిన కొన్ని షాట్లకు ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను యాడ్ చేసి దీన్ని వదలబోతున్నారని తెలిసింది.

Jr NTR and Koratala Movie Intro Video Release On New Year

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X