For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR30: ఎన్టీఆర్ - కొరటాల మూవీ నుంచి సర్‌ప్రైజ్.. ముందుగా అతడి పేరే ప్రకటన

  |

  కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సక్సెస్‌లను అందుకున్న ఈ స్టార్ హీరో.. మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ షూట్ ఇటీవలే పూర్తైపోయింది.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  RRR షూటింగ్ జరుగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఈ ప్రాజెక్టు ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఈ నేపథ్యంలో గురూజీని కాదని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  Jr NTR and Koratala Shiva Movie Music Sittings Begin Soon

  ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్‌ను తీసుకున్నట్లు ఈ వారం లేదా వచ్చే వారంలోనే ఓ అఫీషియల్ అప్‌డేట్ రాబోతుందట. అంతేకాదు, ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

  ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

  వాస్తవానికి ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, దేవీ శ్రీ ప్రసాద్, మణి శర్మ పేర్లు వినిపించాయి. కానీ, వాళ్లను కాదని కోలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిరుథ్ రవిచందర్‌ను తీసుకున్నారు. ఇక, ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్ చేశాడని ఇటీవలే ఓ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అయితే, అతడికి ఉన్న టాలెంట్, డిమాండ్ ఇలా అన్నింటినీ పరిశీలించిన చిత్ర యూనిట్.. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందన్న టాక్ కూడా వినిపించింది.

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టు పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతుందని తెలుస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన రోల్స్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే దీని నేపథ్యం అని టాక్. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. ఇందులో హీరోయిన్ ఎవరన్న దానిపై స్పష్టత రాలేదు.

  English summary
  కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత.. వీరరాఘవ’ వంటి సక్సెస్‌లను అందుకున్న ఈ స్టార్ హీరో.. మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ షూట్ ఇటీవలే పూర్తైపోయింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X