For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొరటాలతో మూవీపై ఎన్టీఆర్ కీలక నిర్ణయం: అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందేనట

  |

  కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు.

  అక్షర హాసన్ అదిరిపోయే ఫొటోలు: శృతి హాసన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. రెచ్చిపోయిన పిల్లికళ్ల పిల్ల

  RRR పట్టాలపై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై కల్యాణ్ రామ్, రాధాకృష్ణ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇది పొలిటికల్ నేపథ్యంతో వస్తుందని.. అందుకే 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెట్టారని అన్నారు. కానీ, ఈ ప్రాజెక్టు ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆగిపోయినట్లు ఆ మధ్య అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాను ఆపేసిన తారక్.. వెంటనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివకే ఓకే చెప్పాడు.

  Jr NTR and Koratala Shiva Movie Shoot Start After RRR Release

  'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో ఈ సినిమా రూపొందుతోంది. దీని షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలో కానీ.. అక్టోబర్ మొదటి వారం నుంచి కానీ ప్రారంభం కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ RRR విడుదలైన తర్వాత అంటే అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట. అంటే అప్పటి వరకూ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదన్న మాట. ఆ లోపు తారక్ RRR మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడమే దీనికి కారణం అనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని అంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే దీని నేపథ్యం అని టాక్. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్శల్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Tollywood Young Hero Jr NTR Busy with RRR Shooting. After This Nandamuri Hero will do a film with Koratala Shiva. This Movie Shoot Start After RRR Release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X