ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్టీఆర్ సడన్ ఎంట్రీ.. ఆ విలువైన భూమి కోసమే సామాన్యుడిలా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.. చరిత్రలో కలవని వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..
ఆ సంగతి అలా ఉంచితే తాజాగా ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. శంకర్పల్లి మండలంలో ఉన్న గోపాలపురం అనే గ్రామంలో ఆరు ఎకరాల 30 సెంట్ల భూమిని ఎన్టీఆర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాల కోసం ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది..
ఎన్టీఆర్ ఎమ్మార్వో ఆఫీస్ కి వచ్చారు అన్న సంగతి తెలుసుకుని పెద్ద ఎత్తున ఆ గ్రామానికి చెందిన యువకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వారంతా ఎన్టీఆర్ తో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో రిజిస్ట్రేషన్ అధికారి తాసిల్దార్ కృష్ణ కుమార్ అలాగే ఇతర సిబ్బంది కూడా ఫోటోలు తీసుకున్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు. సాధారణంగా హీరోలు కాస్త డబ్బు సంపాదించిన వెంటనే ఎక్కువగా భూముల మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎన్టీఆర్ కూడా దానికి మినహాయింపు ఏమీ కాదు.
గతంలో తన తాత గారి సొంత ఊరు గుడివాడ దగ్గర్లో అనేక భూములు కొనుగోలు చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళితో సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమా పొలిటికల్ యాంగిల్ లో ఉండబోతోందని ప్రచారం జరుగుతుండటంతో సినిమా మీద భారీ గా ఆసక్తి నెలకొని ఉంది.
ఇక ఆ తర్వాత ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కేజిఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రాక పోయినా సరే ఈ సినిమా కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.. సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ద్వారా కూడా త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను పలకరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











