Jagame Thandhiram on netflix: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ధనుష్, విద్యాబాలన్, ప్రియదర్శి చిత్రాలు..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌‌లు కొనసాగుతుండటంతో థియేటర్లు నిరవధికంగా మూతపడ్డాయి. దాంతో పలువురు నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌లో విడుదలకు సిద్దమైన మూవీస్ ఇవే...

ధనుష్ నటించిన జగమే తాంధిరమ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం జూన్ 18వ తేదీన విడుదల అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి.

ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెబ్ సిరీస్ జూన్ 18వ తేదీన ఆహా యాప్‌లో రిలీజ్ అవుతున్నది. ఇందులో ప్రియదర్శిని, నందినీ రాయ్, పోసాని మురళీ కృష్ట తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు విద్యాసాగర్ ముథుకూర్ దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన షేర్ని చిత్రం కూడా జూన్ 18వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నది.

June OTT Releases: Jagame Thandhiram, Sherni, In the name of God read for Streaming

గ్రహణ్ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్‌లో జూన్ 24వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇందులో పవన్ మల్హోత్రా, జోయా హుస్సేన్ తదితరులు నటించారు.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత మనోజ్ బాజ్‌పేయ్ నటించిన రే నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్ నాలుగు కథల సంకలనం. ఇందులో హర్షవర్ధన్ కపూర్, కేకే మీనన్, రాధిక మదన్, శ్వేతబసు ప్రసాద్, రఘువీర్ యాదవ్ తదితరులు నటించారు.

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నటించిన హసీన్ దిల్‌రుబా చిత్రం జూలై 02వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. వినిల్ మ్యాథ్యూ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రాంత్ మెస్సీ, హర్షవర్ధన్ రాణే, హన్సిక మోత్వాని నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X