twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #JusticeForBruno: చావు ఎవరిదయినా చావే, కరోనా లాంటివి రావడం సమంజసమే!

    |

    #JusticeForBruno అనే హ్యాష్ ట్యాగ్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని మీద బాలీవుడ్ మొదలు టాలీవుడ్ హీరోయిన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావణ్య కూడా ఇప్పుడు ఈ విషయంలో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

     బయటకు వెళ్ళడంతో

    బయటకు వెళ్ళడంతో

    తిరువనంతపురం సమీపంలో పెంపుడు కుక్కను కట్టి, కనికరం లేకుండా చంపిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో #JusticeForBruno అనే హ్యాష్‌ ట్యాగ్ వైరల్ అయింది. ఆదిమలతురకు చెందిన క్రీస్తు రాజ్ 8 సంవత్సరాలుగా బ్రూనో అనే కుక్కను పెంచుతున్నాడు. తాజాగా క్రీస్తు రాజ్ తన స్నేహితులతో కలిసి కుక్కను పడవకు కట్టి బయటకు వెళ్ళాడు.

    దారుణంగా చంపి

    దారుణంగా చంపి

    అయితే వాళ్ళు బయటకు వెళ్ళాక ఆ కుక్క బాగా మొరుగుతున్నందున పక్క ఇళ్ళలో ఉండే పిల్లలు పడవకి దానిని తలకిందులుగా వేలాడదీసి, కనికరం లేకుండా కొట్టి, కర్రతో హింసించడంతో చనిపోయింది. అలా కొడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. కుక్కపై దారుణంగా దాడి చేయబడిన వీడియో ప్రస్తుతం #JusticeForBruno అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కుక్క యజమాని క్రిస్తు రాజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

    ముగ్గురు మైనర్లు అరెస్ట్

    ముగ్గురు మైనర్లు అరెస్ట్

    ఇక ఈ విషయం మీద కేరళ హైకోర్టు కూడా స్వచ్ఛందంగా కేసు నమోదు చేసింది. అంతేకాక ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితులు తిరువనంతపురానికి చెందిన మైనర్లుగా చెబుతున్నారు పోలీసులు. వీరిని జూలై 1నే వింజినం పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. చనిపోయిన ఆ కుక్కను సముద్రంలోకి విసిరేశారు.

    ప్రాణం ఎవరిదైనా ప్రాణమే

    ప్రాణం ఎవరిదైనా ప్రాణమే

    ఇక ఈ భయంకరమైన వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు సైతం తాజాగా సోషల్ మీడియా ద్వారా ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనుష్క శర్మ, అలియా భట్, టైగర్ ష్రాఫ్, దిశా పటాని, మలైకా అరోరా, లావణ్య త్రిపాఠి తదితరులు సోషల్ మీడియాలో ఈ సంఘటనపై స్పందిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావణ్య ట్వీట్ చేస్తూ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అని, ఇది మర్డర్ ఏ అని అన్నారు.

    కరోనా లాంటివి రావడం సమంజసమే

    కరోనా లాంటివి రావడం సమంజసమే

    ఇక దారుణమైన ఘటనపై యాంకర్ రష్మీ కూడా స్పందించారు. మనుషులు, మానవత్వాలు అనే పదాల మీదే సిగ్గేస్తోందన్న ఆమె ఇలాంటివి చూశాక కరోనా లాంటివి రావడం సమంజసమేనని అనిపిస్తోందని పేర్కొన్నారు. అది మీకేం అన్యాయం చేసింది.. అదేం పాపం చేసిందని దాన్ని అలా చంపారు ? అంటూ రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది.

    English summary
    Justice For Bruno: Alia, Anushka, Malaika, lavanya thripati & Others Demand Justice Dog Who Was Brutally Beaten To Death By 3 Youths In Kerala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X