వాడిని నడిరోడ్డుపై ఉరి తీయాలి.. నా సినిమాను తొక్కుతావా? నిర్మాత వార్నింగ్

ఎన్నో కష్టాలకు, వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలు తీస్తుంటారు దర్శక నిర్మాతలు. ఎన్నో అంచనాల మధ్య రిలీజయ్యే సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతాయో లేదో తెలియదు. కానీ ఈలోగా సినిమాలపై దుష్ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి తయారవుతోంది. బాగున్న సినిమాలను కూడా బాలేదంటూ నెగిటివ్ రివ్యూలు, ట్రోలింగ్‌తో నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకొస్తున్నారు. దీంతో సినిమాలకు రివ్యూలు రాసే రివ్యూయర్‌లను దర్శక నిర్మాతలు, హీరోలు టార్గెట్ చేస్తున్నారు. మొన్నామధ్య నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.. రివ్యూయర్‌లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు కే ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేష్ దండా.

అక్టోబర్ 18న కే ర్యాంప్‌
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే ర్యాంప్. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్‌లు సంయుక్తంగా కే ర్యాంప్ మూవీని నిర్మించారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించారు. నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. కే ర్యాంప్ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించగా.. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహించారు.

K Ramp Movie Producer Razesh Danda warned those who spread negative publicity on Kiran Abbavaram movie

వసూళ్ల వర్షం కురిపిస్తోన్న కే ర్యాంప్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కే ర్యాంప్ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఏకంగా 4.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన కే ర్యాంప్ మూవీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇండియాలో ఈ సినిమా తొలి రోజు 2.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.75 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.35 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. మూడు రోజుల వరకు ఇండియాలో 7.35 కోట్ల రూపాయల నెట్... 8.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో వచ్చిన 1.5 కోట్ల రూపాయలతో కలిపి కే ర్యాంప్ చిత్రానికి మూడు రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయలు వచ్చాయి. దీపావళి, వీకెండ్ ముగిసినప్పటికీ కిరణ అబ్బవరం చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

రివ్యూలలో పక్షపాతం
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల నుంచే నిర్మాత రాజేష్ దండా దూకుడు పెంచారు. ముఖ్యంగా సినిమాలకు సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ పబ్లిసిటీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పనిగట్టుకుని సినిమాలకు నెగిటివ్ రివ్యూలు, తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారని .. దీని వల్ల ఎన్నో సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయని రాజేష్ ఫైర్ అయ్యారు. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ సినిమాల పట్ల పక్షపాతం చూపిస్తున్నాయని రాజేష్ ఆరోపించారు.

వాడిని ఉరి తీయాలి
తాజాగా కే ర్యాంప్ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక వెబ్‌సైట్ ఇంకా ఏడుస్తోంది... వాడికి చెబుతున్నా, అమెరికాలో ఉన్న ప్రదీప్‌గా... పగలగొడతా. నీకేం తెలుసురా లు** కా. డ్యూడ్‌కు 196K అని నా సినిమాకు మాత్రం 47K అని వేస్తున్నాడు. అది తెలుగు, తమిళ్‌లో రా కుక్కా. తొక్కుతావా సినిమాని తొక్కురా నువ్వు మగాడివైతే. మొగొడిగా చెబుతున్నా మళ్లీ, ఒక హిట్టు సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా***ని ఏం చేయాలి? ఉరి తీయాలి వీడిని నడిరోడ్డు మీద... మా మీద బతికే నా*** అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X