India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kinnerasani: ఓటీటీలో నేరుగా మెగా హీరో మూవీ.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తంలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. ఇప్పటికే చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ఒకడు. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఆ ముద్ర తనపై పడకుండా ఉండడంతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే 'విజేత' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. కానీ, నటన పరంగా కల్యాణ్ దేవ్‌కు మంచి మార్కులే పడ్డాయి.

  షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన దీప్తి సునైనా: ఎద అందాలు ఆరబోస్తూ యమ హాట్‌గా!

  ఈ ఏడాది ఆరంభంలోనే కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. దీంతో అతడికి హీరోగా గ్రాండ్ ఎంట్రీ మాత్రం దక్కకుండానే పోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే అతడు ఈ సారి ప్రయోగాత్మకంగా 'కిన్నెరసాని' అనే విభిన్నమైన సినిమాను చేశాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు.

   Kalyaan Dhev Kinnerasani Movie Release on ZEE5 on June 10th

  వైవిధ్యమైన కథతో రూపొందిన 'కిన్నెరసాని' మూవీని జనవరి 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకూ దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేదు. దీంతో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా విడుదల గురించి షాకింగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇందులో దీన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

  అందాల ఆరబోతలో హద్దు దాటిన అనన్య: వామ్మో ఆమెనిలా చూశారంటే!

  కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'కిన్నెరసాని' మూవీ డిజిటల్ రిలీజ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను జూన్ 10 తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇందులో 'తన తండ్రి కోసం అన్వేషిస్తోన్న వేద ప్రయాణంతో రాబోతున్న మిస్టరీ కథే కిన్నెరసాని. జూన్ 10వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది' అని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న కల్యాణ్ దేవ్.. ఈ సారి సక్సెస్ కావాలన్న లక్ష్యంతో చేసిన సినిమానే 'కిన్నెరసాని'. ఈ మూవీని రమణ తేజ తెరకెక్కించాడు. ఇందులో కశీష్ ఖాన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, రవీంద్ర విజయ్, షీటల్, మహతీ భిక్షు తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రామ్ తళ్లూరి నిర్మించారు. మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

  English summary
  Mega Star chiranjeevi son in law Kalyaan Dhev Did Kinnerasani Movie Under Ramana Teja Direction. This Movie Release on ZEE5 on June 10th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X