Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నివేదా థామస్ కంటతడి పెట్టించింది.. నా వయసు చాలదు.. ఎమోషనల్‌గా కల్యాణ్ రామ్
యువ నిర్మాత మహేష్ కోనేరు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 118. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్‌కు, విలక్షణ నటి నివేదా థామస్, అందాల భామ షాలిని పాండే జంటగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం వహించిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కల్యాణ్ రామ్, కేవీ గుహన్, నివేదా థామస్, మహేష్ కోనేరు, మిర్చి కిరణ్, శేఖర్ చంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..

సొంతంగా మూవీ తీయాలనిపించేలా
సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ కథ చెప్పినప్పుడే ఎంతో టెన్షన్, ఆసక్తి కలిగింది. సొంతంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో చేయాలనే ఫీలింగ్ కలిగింది. అయితే మహేష్ కోనేరు కథ వింటానని చెప్పడంతో ఒకే అన్నాను. కథ విన్న తర్వాత నేనే చేస్తానని చెప్పడంతో సరే అన్నాను. ఇక సినిమాకు శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. రీరికార్డింగ్ అద్భుతంగా వచ్చింది అని కల్యాణ్ రామ్ అన్నారు.

నివేదా థామస్ చుట్టే కథ
ఇక 118 చిత్రానికి నివేదా థామస్ నటన హైలెట్‌గా నిలుస్తుంది. కథ మొత్తం నివేదా థామస్ చుట్టే తిరుగుతుంది. నా పాత్ర మాత్రం కథలో భాగంగా నడుస్తుంది. డబ్బింగ్ చెప్పిన సమయంలో నివేదా థామస్ నటన చూసి కంటతడి పెట్టుకొన్నాను. అంతా బాగా నటించింది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పడం భావ్యం కాదు అని కల్యాణ్ రామ్ ఉద్వేగంగా మాట్లాడారు.

నాలుగు పాత్రల్లో కేవీ గుహన్
ఇక కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, కథకుడిగా, దర్శకుడిగా నాలుగు విభాగాలను సమర్ధవంతంగా పోషించారు. కేవీ గుహన్ సినిమాటోగ్రఫి గురించి మాట్లాడటం నా వయసు చాలదు. దర్శకుడిగా ఆయన విజన్ ఓ మ్యాజిక్ మాదిరిగా ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు.

ప్రతీ ఒక్కరికి నచ్చే విధంగా
నివేదా థామస్ మాట్లాడుతూ.. కేవీ గుహన్ దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. కల్యాణ్ రామ్ నటన ఆకట్టుకోవడం గ్యారెంటీ. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. కేవీ గుహన్, మహేష్ కోనేరుకు నా ధన్యవాదాలు అని అన్నారు.