నటి గౌతమికి షాకిచ్చిన కమల్ హాసన్.. మరో హీరోయిన్‌తో అంటూ...

విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి రీమేక్‌ చిత్రంతో సిద్దమవుతున్నట్టు తమిళ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతున్నది. దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించిన దృశ్యం సినిమాకు రీమేక్‌గా దృశ్యం 2 విడుదలై అందర్నీ ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా వెంకటేష్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో కూడా దృశ్యం చిత్రం పాపనాశనం టైటిల్‌తో రీమేక్ చేసి కమల్, గౌతమి నటించారనే విషయం తెలిసిందే.

ప్రస్తుతం కమల్ హాసన్ దృశ్యం 2 చిత్రాన్ని పాపనాశనం 2గా తెరకెక్కించేందుకు సంప్రదింపులు, కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ చిత్రంలో గౌతమికి బదులుగా నటి మీనాను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకొంటున్నట్టు తెలిసింది. మీనాతో కమల్ సంప్రదింపులు జరిపినట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అయింది.

Kamal Haasan is planning Dhrishyam 2 with Meena instead of Gautami

పాపనాశనం సినిమా సమయంలో కమల్, గౌతమి కలిసి జీవనం చేశారు. ఆ సినిమా తర్వాత వారి జీవితంలో అనేక మార్పులు, ఊహించని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఆ తర్వాత కమల్, గౌతమి విడిపోవడం సంచలనం రేపింది. ఈ క్రమంలో గౌతమికి బదులుగా మీనాను తీసుకొవాలని కమల్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.

కమల్ హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. దర్శకుడు శంకర్ తెరకెక్కించే ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X