For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kanchana 3 నటి ఆత్మహత్య.. హోటల్ గదిలో బలవన్మరణం.. అసలు ఏం జరిగింది?

  |

  రాఘవ లారెన్స్ హారర్ మూవీలో నటించిన ఒక 24 ఏళ్ల నటి తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. అలెగ్జాండ్రా జావి అనే రష్యన్ యువతి రాఘవ లారెన్స్ 'కాంచన 3' లో నటించారు. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో ఆమె తన పవర్ఫుల్ నటనతో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే హఠాత్తుగా కాంచన నటి మరణించిందని వార్తలు రాగానే అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆమె మృతి వెనుక అనేక రకాల అనుమానాలు కూడా వెలువడుతున్నాయి.

  పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో

  పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో

  2019లో భారీ అంచనాల నడుమ విడుదలైన రాఘవ లారెన్స్ కాంచన 3 సినిమా తెలుగు తమిళ్ లో భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇక ఆ యాక్షన్ హారర్-కామెడీ చిత్రంలో ఓవియా మరియు వేధిక ప్రధాన కథానాయికల పాత్రలలో నటించగా అలెగ్జాండ్రా జావి ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో జావు నటించిన విధానం సినిమాలో హైలెట్ గా నిలిచింది. రాఘవ లారెన్స్ కూడా ఆమె నటనపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు.

  కారణం అదేనా?

  కారణం అదేనా?

  ఇక హఠాత్తుగా అలెగ్జాండ్రా జావి మరణించిందనే వార్తలు రాగానే అందరూ షాక్ అవుతున్నారు. గోవాలో ఆమె బస చేసిన హోటల్ లోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమె డిప్రెషన్‌లో ఉందని కూడా పోలీసులకు తెలిపారు. డిప్రెషన్ లోకి వెళ్లి ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

   లైంగిక వేధింపులు

  లైంగిక వేధింపులు

  అయితే అంతకు ముందు 2019 లో చెన్నై ఫోటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అలెగ్జాండ్రా జావి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఇక ఆ కోణంలో కూడా పోలీసులు అనేక రకాలుగా కూడా విచారణ జరుపుతున్నారు. ఇక ఇప్పటికే అలెగ్జాండ్రా జావి మరణవార్తను వారి బంధువులకు చేరవేశారు. ఇతర ఫార్మాలిటీలను రష్యన్ కాన్సులేట్ పరిశీలిస్తుంది.

  ఉరి వేసుకొని

  ఉరి వేసుకొని

  ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే అవకాశం ఉందని, ఆ కోణంలో కూడా విచారణ చేపడతామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చూస్తున్నారు. 2019లో ఒక ఫొటోగ్రఫర్ తన ఫొటోలని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అలెగ్జాండ్రా జావి పోలీసు కేసు నమోదు చేసింది. నివేదికల ప్రకారం, అలెగ్జాండ్రా మృతదేహం ఆమె గది పైకప్పుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. ప్రస్తుతం అయితే ఆమె ఆత్మహత్య కారణంగా మరణించి ఉండవచ్చునని పోలీసులు పేర్కొన్నారు, అయితే వారు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

  Raghava Lawrence Once Again Responds On Seeman Issue|| Filmibeat Telugu
   ప్రియుడితో గొడవ?

  ప్రియుడితో గొడవ?

  ఇటీవల ఆమె ప్రియుడు ఆమెను విడిచిపెట్టడంతో ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు సమాచారం. మరణానికి సంబంధించిన అన్ని కోణాలను గోవా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరియు ఆమె మాజీ ప్రియుడిని విచారించే అవకాశం ఉంది.

  2019 లో, చెన్నై లైంగిక వేధింపుల ఫోటోగ్రాఫర్‌పై ఆమె ఫిర్యాదు చేసింది మరియు అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని గోవా పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. మెడికో ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ప్రతినిధులను నియమించడానికి దర్యాప్తు అధికారులు ఇప్పటికే రష్యన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఇక ఆమెకు కేవలం 24 సంవత్సరాలు, ఆమె అకాల మరణం కోలీవుడ్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది

  English summary
  Kanchana 3 movie Actress Alexandra Djavu Found Dead in Goa
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X