Yash Toxic: టాక్సిక్‌తో యష్ కు సవాల్.. ఆ బాధ్యత అంతా కన్నడ స్టార్ పైనే
కన్నడ స్టార్ హీరో, ఇండియాస్ టాప్ హీరో యష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ : ఛాప్టర్ 1, కేజీఎఫ్ : ఛాప్టర్ 2 చిత్రాలతో ఎంతగానో అలరించాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, నార్త్, ఓవర్సీస్ లోనూ భారీ క్రేజ్ దక్కించుకున్నారు. ఈ రెండు చిత్రాలతో యష్ సెన్సేషన్ గా మారారు. దీంతో యష్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రంపై ఇండియా వైడ్ గా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే యష్ తన రాబోయే చిత్రాలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నెక్ట్స్ యష్ నుంచి TOXIC The Movie చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కాగా సినిమాను 2026 మార్చి 19న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ పెద్ద ఎత్తున థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఓవర్సీస్ లో టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేయాల్సి ఉందని, ఆ బాధ్యతలను పూర్తిగా కన్నడ స్టార్ యష్ పైనే ఉందంట. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రంతో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ అమెరికాలో ఎంతలా ప్రమోట్ చేశారో తెలిసిందే. ఇక అదే స్ట్రాటజీని యష్ తన రాబోయే చిత్రం టాక్సిక్ కు అప్లై చేస్తున్నారు. కానీ యష్ ఒక్కడే భారీ స్థాయి ప్రమోషన్ ను ఎలా డీల్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు టాక్సిక్ చిత్రం చిత్రీకరణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. తాజాగా ముంబైలోని కీలక షెడ్యూల్ ను, బెంగళూరు షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా లండన్ కు ప్రయాణం అయ్యారు యష్. ఇంటర్నేషనల్ షెడ్యూల్ ఒకటి పూర్తైతే సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని అంటున్నారు. ఇప్పటి వరకు 90 శాతం చిత్రీకరణ పూర్తైందని తెలుపుతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాత వెంకట్ కే నారాయణ రూపొందిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, టోవినో థామస్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, డారెల్ డిసిల్వా, నటాలీ బర్న్, కైల్ పాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు రాజీవ్ రవి సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక యష్ బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న రాామాయణ : పార్ట్ 1, రామాయణ : పార్ట్ 2 చిత్రాల్లో రావణుడి పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











