Devi Sri Prasad పై కరాటే కల్యాణి కేసు.. మనోభావాలు దెబ్బ తీశారంటూ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవల విడుదల చేసిన ఓ పిల్లా మ్యూజిక్ వివాదంలో ఇరుక్కుపోయింది. ఈ ఆల్బమ్‌లో వాడిన సాహిత్యం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పురాణాలను కించపరిచే విధంగా మ్యూజిక్ ఆల్బమ్‌పై కరాటే కల్యాణి కేసు నమోదు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

ఓ పిల్లా మ్యూజిక్ ఆల్బమ్‌తో
ఓ పిల్లా టైటిల్‌తో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బమ్‌ను సంగీత ప్రియుల ముందుకు తీసుకొచ్చారు. ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ టీ సీరిస్ బ్యానర్‌పై గుల్షన్ కుమార్ ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను సమర్పించారు. అమెరికా, యూఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఈ ఆల్బమ్ షూట్ చేసి ఇటీవల రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను ఈ పాట కూడగట్టుకొంటున్నది.

హరే రామ.. హరే కృష్ణ అంటూ
ఓ పిల్లా మ్యూజిక్ ఆల్బమ్‌లోని పాటలో.. ఓ పిల్లా.. నీ కళ్లు ఉన్నాయ్.. ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్.. ఓ పిల్లా నీ మాటలే.. త్రీ స్టార్ చాక్లెట్ బార్.. ఈ పాట సాగుతుంది. అయితే పాటలో రామ.. రామ.. బోలో కృష్ణ హరే అంటూ సాహిత్యాన్ని జొప్పించారు. అయితే రామ, కృష్ణ పదాలను ఈ రొమాంటిక్ పాటలో చేర్చడంపై పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అశ్లీల దుస్తులు.. స్టెప్పులతో
ఓ పిల్లా పాటలో హరే రామ.. హరే కృష్ణ పదాలను చేర్చడం హిందువుల మనోభావాలను కించపరచడమే. పవిత్రమైన రాముడు, కృష్ణుడు పేర్లను అశ్లీల దుస్తులు, డ్యాన్సులు, స్టెప్పులతో దిగజారేలా చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ తీరుతో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి అని హిందూ సంస్థల నిర్వాహకులు ఆరోపించారు.

కఠిన చర్య తీసుకోవాలి.. అంటూ
ఓ పిల్లా పాట హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. టాలీవుడ్ నటి కరాటే కల్యాణి, ఇతర హిందూ సంస్థల నిర్వాహకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్పందించని దేవీ శ్రీ ప్రసాద్
అయితే ఓ పిల్లా మ్యూజిక్ ఆల్బమ్‌పై కరాటే కల్యాణి, హిందూ సంస్థలు కేసు నమోదు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదంపై దేవీ శ్రీ ప్రసాద్ మౌనం వహించారు. ఈ కేసు విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ స్పందన ఎలా ఉంటుందోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫిర్యాదు మేరకు ఆ పదాలను తొలగిస్తారా లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











