క్షేమంగా ఇంటికి చేరిన కరీనా కపూర్.. భారీ సెక్యూరిటీ మధ్య సీక్రెట్‌గా చిన్నారిని..
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ప్రసవానంతరం క్షేమంగా ఇంటికి చేరుకొన్నారు. భర్త సైఫ్ ఆలీ ఖాన్, కుమారుడు తైమూర్ ఆలీ ఖాన్‌తో కలిసి వెళ్తూ మీడియా కంటపడ్డారు. రెండు రోజుల క్రితం కరీనా కపూర్ తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరీనా కపూర్‌కు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. తన తల్లిదండ్రలు రణ్‌ధీర్ కపూర్, బబితా కపూర్, అలాగే తన సోదరి కరిష్మా కపూర్ హాస్పిటల్‌ను సందర్శించి చిన్నారికి దీవెనలు అందించారు.
మంగళవారం కరీనా కపూర్ ఫ్యామిలీ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి తమ స్వగృహానికి చేరుకొన్నారు. భారీ సెక్యూరిటీ మధ్య కారులో తమ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిన్నారిని ఎవరికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. సైఫ్ తల్లి చేతిలో చిన్నారిని వస్త్రంలో భద్రంగా ఉంచారు. మీడియా కంట పడకుండా పక్కాగా ప్లాన్ చేసి చిన్నారిని ఇంటికి చేర్చారు.

కరీనా కపూర్ ప్రసవ సమయంలో తైమూర్‌ను తన పెద్దమ్మ కరిష్మా కపూర్ ఇంటిలో ఉంచారు. ప్రస్తుతం తన సోదరుడు ఇంటికి వచ్చిన సమయంలో తైమూర్ తమ నివాసానికి ఆనందంతో చేరుకొన్నారు.


Click it and Unblock the Notifications











