కరీనా కపూర్ రెండో కుమారుడికి నామకరణం.. పిల్లాడి పేరు ముద్దు ముద్దుగా.. క్రేజీగా!

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన రెండో కుమారుడికి జేహ్ అనే పేరు పెట్టినట్టు మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల కరీనా కపూర్ రెండో సంతానానికి పేరు ఏమీ పెట్టారని ఆంగ్ల మీడియా ఆరా తీయగా.. కరీనా తండ్రి, అలనాటి హీరో రణ్‌దీర్ కపూర్ ధృవీకరించారు.

రణధీర్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ.. కరీనా, సైఫ్ దంపతులు తమ రెండో బిడ్డకు జేహ్ అనే పేరు పెట్టింది నిజమే. ఓ వారం క్రితమే ఈ పేరును ఖరారు చేశాం. మీరు విన్న వార్తలో నిజమే ఉంది అంటూ ఆయన వివరణ ఇచ్చారు.

 Kareena Kapoors second child name as Jeh, Randhir Kapoor confirms

తమ కుటుంబంలో కరీనా, సైఫ్‌తోపాటు అందరూ పిల్లాడిని జేహ్ అని పిలుస్తున్నాను. ఇంకా అధికారికంగా ప్రభుత్వరికార్డుల్లోకి ఎక్కించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, తన రెండో కుమారుడి ఫోటోను ఇప్పటి వరకు పూర్తిగా చూపించలేదు.

ఇదిలా పక్కన పెడితే.. సైఫ్, కరీనా కపూర్ దంపతులు తమ మొదటి బిడ్డకు తైమూర్ ఆలీ ఖాన్ అని పేరు పెడితే.. దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద దుమారమే రేగింది. భారత్‌పై దండయాత్ర, యుద్దాలు ప్రకటించిన పరదేశీ రాజు పేరు పెట్టడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

ఇక కరీనా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆమె షూట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. లాల్ సింగ్ చద్దా చిత్రం హాలీవుడ్‌లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X