కీర్తీ సురేష్ మూవీ ఓటీటీలో... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

అందాల భామ కీర్తీ సురేష్ మహానటి చిత్రంతో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. మహానటి చిత్రం తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ, అలాగే టాప్ హీరో సినిమాల్లోను నటించే అవకాశాలను చేజిక్కించుకొన్నారు. అయితే లాక్‌డౌన్‌లోను.. ఆ తర్వాత కూడా కీర్తీ సురేష్ తన సత్తాను చాటుకొన్నారు. గతేడాది లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూసి వేయడంతో ఆమె చిత్రాలు రెండు కూడా ఓటీటీలో వచ్చాయి.

తొలుత పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాగా, అనంతరం మిస్ ఇండియా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆమె నటించిన చిత్రం గుడ్ లక్ సఖీ చిత్రం వాయిదా పడింది. అయితే ఈ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్తలు ఊపందుకొన్నాయి. అయితే ఓటీటీ రిలీజ్ వార్తలను నిర్మాత సుధీర్ చంద్ర పధీరి ఖండించారు.

గుడ్‌లక్ సఖీ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతున్నదనే వార్తల్లో నిజం లేదు మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మకండి. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలన్నా.. లేదా రిలీజ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా మేము అధికారికంగా వెల్లడిస్తాం అని సుధీర్ చంద్ర వెల్లడించారు.

Keerthy Sureshs Good Luck Sakhi producer clarity on OTT release

దర్శకుడు నాగేశ్ కుకునూర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆగస్టు 2020లో రిలీజైంది. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫి, ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను అందిస్తున్నారు.

కీర్తీ సురేష్ కెరీర్ విషయానికి వస్తే.. రంగ్ దే చిత్రంలో నితిన్‌తో కలిసి నటించారు. మారక్కర్: అరబికడలింటే సింహం, అన్నాతే, సాని కాయిధమ్, వాషీ, సర్కారు వారీ పాట చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X