KGF: Chapter 2 release date: మరోసారి వాయిదా పడ్డ విడుదల.. లేటైనా యష్ లేటెస్ట్‌గా
గత ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమ పరిస్థితి అధ్వాన్నంగా తయారు అవుతున్నది. పలు భారీ చిత్రాలు విడుదలకు నోచుకోలేక పోయాయి. పలు అగ్రహీరోల చిత్రాల రిలీజ్‌కు కరోనావైరస్ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమా రిలీజ్‌పై ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

సెకండ్ వేవ్ తర్వాత ప్లాన్‌లో మార్పు
2021 సంవత్సరం ఆరంభంలో కేజీఎఫ్: ఛాప్టర్ 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఫస్ట్ వేవ్ సందర్భంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం అనువైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నది. పరిస్థితులు అనుకూలిస్తే సినిమాను రిలీజ్ చేయాలని చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తున్నది. అయితే సెకండ్ వేవ్ తర్వాత కాస్త పరిస్థితి మెరుగ్గా కనిపించడంతో కేజీఎఫ్2ను రిలీజ్ చేయాలని ప్రణాళికను సిద్దం చేసినట్టు కనిపిస్తున్నది.

గతేడాది ప్రశాంత్ నీల్ క్లారిటీ
గతేడాది దర్శకుడు ప్రశాంత్ నీల్ మీడియాతో మాట్లాడుతూ. 2021 సంవత్సరం జూలై 16వ తేదీన కేజీఎఫ్2 రిలీజ్ చేయాలని అనుకొంటున్నామని అన్నారు. అయితే ప్రస్తుతం మరోసారి ఈ సినిమా రిలీజ్ కాస్త ముందుకు జరిపారు. కేజీఎఫ్2ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నట్టు ప్రముఖ సినీ విమర్శకుడు ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ సినిమా డేట్ గురించి సంకేతాలు అందించారు.

సెప్టెంబర్ 9వ తేదీన
తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. కేజీఎఫ్2 రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తున్నాను. ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యష్ నటించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయాలని అనుకొంటున్నారు. బహుశా ఇదే ఫైనల్ రిలీజ్ డేట్ అనుకోవడానికి వీలు లేదు. నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు అని పేర్కొన్నారు.

అధీరా పాత్రలో సంజయ్ దత్
2018లో రిలీజైన కేజీఎఫ్: ఛాప్టర్ 1 ఊహించని విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీ సీక్వెల్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో బాలీవుడ్, టాలీవుడ్ నటులందరినీ రంగంలోకి దించారు. అధీరా అనే విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. అలాగే టాలీవడ్ నుంచి రావు రమేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

కేజీఎఫ్ 2లో ఎవరెవరు అంటే..
KGF: Chapter 2 చిత్రం విషయానికి వస్తే.. ఇందులో ప్రేక్షకులను ఆకట్టుకొనే భారీ తారాగణం ఉంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్, అనంత్ నాగ్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమా భారీ అంచనాల పెరగడం, దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తుందనే విశ్వాసాన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











