twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sebastian PC 524 Twitter Review: రేచీకటి పోలీస్‌గా కిరణ్ అబ్బవరం.. మర్డర్ మిస్టరీ మూవీ ఎలా ఉందంటే!

    |

    ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్నారు. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో పరిచయమైన అతడు.. మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'సెబాస్టియన్ పీసీ 524' అనే సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

     సెబాస్టియన్ పీసీగా వచ్చిన కిరణ్

    సెబాస్టియన్ పీసీగా వచ్చిన కిరణ్

    ‘ఎస్ఆర్ కల్యాణమండపం' హిట్‌తో మాంచి ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కించిన చిత్రమే ‘సెబాస్టియన్ పీసీ 524'. నువేక్ష, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను జోవితా సినిమాస్ బ్యానర్‌పై సిద్దా రెడ్డి, రాజు, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. జిబ్రాన్ దీనికి సంగీతం అందించిన ఈ మూవీ తాజాగా విడుదలైంది.

    Aadavallu Meeku Johaarlu ట్విట్టర్ రివ్యూ: శర్వానంద్ మూవీకి షాకింగ్ టాక్.. అలా అయితేనే నచ్చుతుందట!Aadavallu Meeku Johaarlu ట్విట్టర్ రివ్యూ: శర్వానంద్ మూవీకి షాకింగ్ టాక్.. అలా అయితేనే నచ్చుతుందట!

    అంచనాలను పెంచిన అప్‌డేట్స్

    అంచనాలను పెంచిన అప్‌డేట్స్

    మర్డర్ మిస్టరీతో వచ్చిన ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కిరణ్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయని చెప్పొచ్చు.

    బిజినెస్‌కు తగ్గట్లుగానే విడుదల

    బిజినెస్‌కు తగ్గట్లుగానే విడుదల

    కిరణ్ అబ్బవరంకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం' మూవీ హిట్ అవడంతో ‘సెబాస్టియన్ పీసీ 524'కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులు డీసెంట్ రేట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ మిస్టరీ మూవీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

    Bigg Boss Non Stop: షోలో శృతి మించిన అశ్లీలత.. టాప్ విప్పేసిన బ్యూటీ.. ఆ కుర్రాళ్లు ఏం చేశారంటే!Bigg Boss Non Stop: షోలో శృతి మించిన అశ్లీలత.. టాప్ విప్పేసిన బ్యూటీ.. ఆ కుర్రాళ్లు ఏం చేశారంటే!

    సెబాస్టియన్‌కు ఊహించని టాక్

    సెబాస్టియన్‌కు ఊహించని టాక్

    కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీ మర్డర్ మిస్టరీ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చాలా మంది ‘సెబాస్టియన్ పీసీ 524' చిత్రం ఏవరేజ్‌గా ఉందని ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

     ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలాగ

    ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలాగ

    ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం రేచీకటి పోలీస్‌గా హీరో ఫన్నీ క్యారెక్టరైజేషన్‌తో సరదాగా సాగిపోతుందట. ఇంటర్వెల్ కొంత పర్వాలేదనిపిస్తుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం లాజిక్‌లకు దూరంగా ఉంటూ చాలా కృతకమైన సన్నివేశాలతో సాగుతుందట. దీంతో తక్కువ నిడివే ఉన్నా బోర్ ఫీలింగ్ కలుగుతుందని ట్వీట్లు చేస్తున్నారు.

    Bigg Boss Non Stop: అషు, ఆరియానా, తేజస్వీ అసభ్యంగా.. లవర్స్, కిస్‌లు, ఆ పార్ట్‌కు సర్జరీలు అంటూ!Bigg Boss Non Stop: అషు, ఆరియానా, తేజస్వీ అసభ్యంగా.. లవర్స్, కిస్‌లు, ఆ పార్ట్‌కు సర్జరీలు అంటూ!

    సినిమాలో ప్లస్‌.. మైనస్‌లు ఇవే

    సినిమాలో ప్లస్‌.. మైనస్‌లు ఇవే

    ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో కిరణ్ అబ్బవరం నటన, జిబ్రాన్ పాటలు మాత్రమే బాగున్నాయని అంటున్నారు. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉందట. స్క్రీన్‌ప్లే నిరాశజనకంగా ఉందట. అలాగే, సెకెండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు మైనస్‌లుగా మారాయట.

     ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది?

    ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది?

    ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524' మూవీ పూర్తిగా మర్డర్ మిస్టరీ నేపథ్యంతో సాగే డ్రామా అని తెలుస్తోంది. రేచీకటి ఉన్న హీరో మర్డర్ కేసును ఎలా చేధించాడన్నది నమ్మశక్యం కాని విధంగా ఉంటుందట. అయితే, ఫస్టాఫ్‌తో పాటు కొన్ని సన్నివేశాలు బాగున్నాయట. దీంతో ఈ చిత్రాన్ని ఓ సారి చూడొచ్చని అంటున్నారు.

    English summary
    Kiran Abbavaram Now Did a Film Sebastian P.C. 524 Under Balaji Sayyapureddy Direction. Lets See This Movie Twitter Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X