Don't Miss!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- News
వైసీపీపై పోరాటంలో చంద్రబాబు కొత్త వ్యూహం - ఢిల్లీ కేంద్రంగా..!!
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రైతుల సమస్యను పరిష్కరించండి.. కేంద్రానికి హీరో కార్తీ బహిరంగ లేఖ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీని రైతులు దిగ్భందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ హక్కుల సాధనకు ఉత్తరాది రాష్ట్రాల రైతులు కదం తొక్కుతూ ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, రైతుల ఆందోళనపై స్పందించాలంటూ తమిళ నటుడు కార్తీ కేంద్రానికి లేఖ రాశారు. రైతుల హక్కులను కాపాడే విధంగా కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని, రైతుల ఆవేదనను సర్కారు పట్టించుకోవాలని లేఖలో కోరారు.
రైతులు చేపట్టిన ఆందోళనపై మోదీ ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలి. రైతుల ఆందోళనలో పెద్ద ఎత్తున్న మహిళలు, వృద్ధులు పాల్గొంటున్నారు. ఓ చరిత్రాత్మక ఆందోళనకు దారి తీసేలా కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి అని కార్తీ తన లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల ఢిల్లీలో రైతుల ఆందోళనపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ఓ వృద్ధురాలి ఫోటోను ట్వీట్ చేస్తూ.. షహీన్ బాగ్ అల్లర్లలో పాలుపంచుకొన్న మహిళ అంటూ కామెంట్ చేసింది. అయితే ఆమె పంజాబ్‌కు చెందిన మహిళ మహిందర్ కౌర్ అంటూ పలువురు ట్యాగ్ చేయడంతో గందరగోళం నెలకొన్నది.