India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Konda Movie Trailer Review: వాడిని చంపడం నా పనికాదు.. నా భాద్యత.. ఆర్జీవి మార్క్‌తో ఇంటెన్సివ్‌గా!

  |

  కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఉదయం 10.25 గంటలకు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జనవరి 26న, 10.25 గంటలకు కొండా మురళిని షూట్ చేసి చంపడానికి ట్రై చేశారని, అందుకని అదే సమయానికి ట్రైలర్ విడుదల చేశామని అన్నారు.

  సమాజం గురించి నీతుల చెప్పాలి.. బాగు చేయాలి.. పెత్తందార్ల పెత్తనంపై కొంత మంది బడుగువర్గాలు వ్యవస్థపై తిరుగుబాటు చేస్తున్న రోజులవి. విపరీత పరిస్థితుల నుంచి విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వాడే కొండా మురళి.. అంటూ వర్మ కామెంటరీతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

  Konda Movie Trailer Review: Ram Gopal Varma get thru the content

  పారిపోతే మళ్లీచ్చి పోరు చేయవచ్చు అంటూ కొండా మురళి పాత్రధారి త్రిగుణ్‌తో తులసి చెప్పే మాటలు సినిమాలోని ఎమోషనల్ కంటెంట్‌ను, సీరియస్ నెస్‌ను చెప్పింది. అలాగే మంచిగున్న పోరి నన్ను చూడదు.. మంచిగలేని పోరిని నాకు చూడబుద్ది కాదు అనే డైలాగ్స్ కథలోని ప్రేమ, భావోద్వేగాలను చెప్పాయి. కొండా సురేఖ, మురళి ప్రేమ, రాజకీయ ప్రయాణంలోని కొన్ని అంశాలు ట్రైలర్‌లో సహజసిద్దంగా కనిపించాయి.

  రాజకీయాలు లేకుండా ఏం చేసినా అది రౌడీయిజం అవుతుంది. రాజకీయంలో పడి మనం నమ్ముకొన్న విషయాలను మర్చిపోవద్దు అని ఓ నక్సలైట్ అంటే.. గాడికి పోయేదే గందుకు అంటూ కొండా మురళి చెప్పే విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. 'వాడ్ని సంపుడు నా పని కాదు, బాధ్యత' అని ట్రైలర్ చివర్లో కొండా మురళి పాత్రధారి చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది ఎవర్నీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ట్రైలర్ విషయానికి వస్తే.. వర్మ ఇటీవల తీసిన సినిమాలకు, గత చిత్రాలకంటే భిన్నంగా కనిపించింది. కొండాతో వర్మ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వస్తాడో వేచి చూడాల్సిందే.

  రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "కొండా దంపతులు విప్లవకారులు. నేను వాళ్లలా కాదు. నాకు విప్లవకారుడు అయ్యేంత ధైర్యం లేదు. అందుకని, ఎవరైతే రిస్కులు తీసుకుని ఉంటారో? వాళ్ల దగ్గరకు వెళ్లి 'కథ ఇస్తారా? సినిమా తీస్తా' అని తీసేస్తా. ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ల జీవితాలు రకరకాల మలుపులు తిరిగి... ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఆ ప్రత్యేకత వల్ల వందల, వేల మందిపై ఏదో విధంగా ప్రభావం పడుతుంది. మురళి, సురేఖ, సుష్మిత జీవిత అనుభవాలు 'కొండా' సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తాయి. సురేఖ పాత్రలో ఇరా మోర్ కూడా బాగా నటించింది. కొండా ఫ్యామిలీ యూనిక్ ఫ్యామిలీ. మురళి చెప్పిన విషయాలను రెండు గంటల సినిమాగా తీయడం చాలా కష్టం. అందులో కొన్ని విషయాలు తీసుకుని సినిమా చేశా. ఆయన జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు అని చెప్పారు.

  English summary
  Konda Movie Trailer Review: Ram Gopal Varma movie's trailer released on Republic day. This trailer got good response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X