For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR30: అసలైంది పూర్తి చేసిన కొరటాల.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ప్లాన్

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ.. టాలీవుడ్‌లో చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో భారీ విజయాలను అందుకున్న అతడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే, భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. మధ్యలో వరుసగా పరాజయాలు ఎదురైనా.. 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని యమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

  Meena Husband Vidyasagar: మీనా భర్త మృతికి ఆ పక్షులే కారణం.. హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్

  కొన్నేళ్లుగా వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను సైతం తిరగరాసేసింది. ఈ ఉత్సాహంతోనే ఈ తారక్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు.

   Koratala Shiva Completes NTR Movie Script Work

  'జనతా గ్యారేజ్' వంటి భారీ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనికోసం నందమూరి అభిమానులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

  రష్మిక మందన్నా అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడనంత హాట్‌గా!

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే ఈ సినిమా కోసం కొరటాల శివ తాజాగా స్క్రిప్టు వర్కు మొత్తాన్ని పూర్తి చేసుకున్నారట. అంతేకాదు, డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్టోరీని ఆయన కంప్లీట్ చేసుకున్నారని తెలిసింది. ఇక, దీన్ని జూలై మొదటి వారం నుంచి మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాను గతంలో ఎన్నడూ లేని విధంగా పక్కా మాస్ మసాలా సినిమాగా తెరకెక్కించబోతున్నాడట. ఇక, ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌కు ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేలా రూపొందించబోతున్నారన్న మాట.

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు అందరి దృష్టినీ ఆకర్షించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది రాబోతుందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  English summary
  Tollywood Star Hero Jr NTR will do a film Under Koratala Shiva Direction. This Star Director Recently Completes This Movie Script.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X