twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దొరసాని’ కథను 42 సార్లు మార్చారట!

    |

    ఆనంద్ దేవరకొండ, శివాత్మక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'దొరసాని'. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ద్వారా కేవీఆర్ మ‌హేంద్ర అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మెయిన్ స్ట్రీమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జులై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని నిర్మాత‌లు

    ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన మహేంద్ర పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 'దొరసాని' కథ పూర్తి చేయడానికి తనకు 5 ఏళ్లు సమయం పట్టిందని, ముందుగా ఒక కథ అనుకున్న తర్వాత అది సినిమా రూపంలోకి తేవడానికి 42వ సారి మార్పు తర్వాత తాను పూర్తి సంతృప్తి చెందినట్లు వెల్లడించారు. తనది వరంగ‌ల్‌ సమీపంలోని జ‌య‌గిరి గ్రామం అని, 17 ఏళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీలోనే ఉన్నట్లు తెలిపారు.

    KVR Mahesndra about Dorasani movie storty

    2014లో తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు అంతా ట్యాంక్ బండ్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. అది చూసినపుడు వీరి ఆనందానికి కారణం అమ‌ర‌వీరులే క‌దా అని అనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఇలాంటి పోరాటాలు, వాటి వెనక ఉన్న ప్రాణత్యాగాలను కాన్సెప్టుగా తీసుకుని నిశీథి అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇది దాదాపు 18 దేశాల్లో 39 జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డుల‌ను గెలుచుకుందని మహేంద్ర తెలిపారు.

    'నిశీథి' షార్ట్ ఫిల్మ్ వ‌ల్ల నేను ఏం రాయ‌గ‌ల‌ను.. నా బ‌లాలేంటో తెలిసింది. శ్యామ్‌బెన‌గ‌ల్‌లాంటి వారు న‌న్ను అప్రిషియేట్ చేస్తూ మెయిల్స్ చేశారు. ఆ తర్వాతే దొర‌సాని క‌థ రాయడం మొదలు పెట్టాను. 42వ వెర్ష‌న్ రాసిన తర్వాత పూర్తి సంతృప్తి కలిగిందని తెలిపారు.

    English summary
    KVR Mahesndra about Dorasani movie storty. Dorasani is a period romantic drama movie in Telangana backdrop in 1980's directed by KVR Mahendra and produced by Yash Rangineni and Madhura Sreedhar. The movie cast includes Vijay Deverakonda's brother Anand Deverakonda and Rajasekhar's younger daughter Sivathmika are in the lead roles. Prasanth R Vihari scored music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X