Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రీ పోలింగ్ ఎఫెక్ట్: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీ విడుదలకు మరోసారి బ్రేక్
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో విడుదల చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని గతంలో పలు తేదీల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ వారం మరోసారి రిలీజ్ కోసం ప్రయత్నించగా మరోసారి భంగపాటు ఎదురైనట్లు తెలుస్తోంది.
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంతో పాటు మరికొన్ని చోట్ల రీపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మే 19 వరకు రిలీజ్ చేయడానికి వీల్లేదని ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక మరోసారి విడుదల వాయిదా వేశారు. పరిస్థితి చూస్తుంటే మే 23 ఎన్నికల ఫలితాల తర్వాతే చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో వివాదం కారణంగా ఈ మూవీ రిలీజ్ ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉందని, ఎన్నికల తర్వాతే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కొందరు న్యాయస్థానాన్నిఆశ్రయించడంతో మూవీ విడుదల కాలేదు.
అన్ని ఏర్పాటు పూర్తయిన తర్వాత సినిమా ఉన్నట్టుండి రిలీజ్ ఆగిపోవడంతో ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సినిమా ప్రమోషన్ కోసం విజయవాడ వెళ్లిన వర్మకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. వర్మ పెట్టే ప్రెస్ మీట్ వల్ల స్థానికంగా శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో అతడిని విజయవాడ రాకుండా అడ్డుకున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.