twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కు మరో సినీ వారసుడు.. స్టార్ హీరో మనవడు హీరోగా సీతామనోహర శ్రీరాఘవ

    |

    తెలుగు సినీ పరిశ్రమకు మరో నట వారసుడు రాబోతున్నాడు. 70వ దశకంలో స్టార్ హీరోలకు మించిన అందం, నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న హరనాథ్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఒకరు పరిచయం కాబోతున్నారు. స్వర్గీయ హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా సీతామనోహర శ్రీరాఘవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఫోటోలను, వీడియోను యాక్టింగ్ ట్రైనర్ సత్యానంద్ రిలీజ్ చేసి విరాట్ రాజ్‌కు ఆశీస్సులు అందజేశారు.

    సీతామనోహర శ్రీరాఘవ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విరాట్ రాజ్ ఫోటోలను పరిశీలిస్తే పెద తాత హరనాథ్ గుర్తుకు వస్తారు.
    ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఫోటోల్లో విరాట్ రాజ్ గన్ చేతబట్టి యాక్షన్ హీరో వెంకట సుబ్బరాజు, భక్త తుకారాం, కోడె నాగు, రిక్షా రాజి లాంటి అలనాటి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. తాత వెంకట సుబ్బరాజు, పెద తాత హరనాథ్ స్ఫూర్తితో సీతామనోహర శ్రీరాఘవ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అని విరాట్ రాజ్ అన్నారు.

    Late actor Haranaths grandson Virat raj introducing with Seeta Manohara Sri Raghava

    దర్శకుడిగా పరిచయమవుతున్న దుర్గా శ్రీ వత్సస కే మాట్లాడుతూ... హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్‌ను విరాట్ రాజ్ సొంతం చేసుకునేలా కథను సిద్ధం చేయటం జరిగింది. సీతామనోహర శ్రీరాఘవ పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం భావోద్వేగాలతో కూడుకొన్నది, KGF 2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు అని దర్శకుడు అన్నారు.

    Late actor Haranaths grandson Virat raj introducing with Seeta Manohara Sri Raghava

    వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా విరాట్ రాజ్‌ను పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది అని చిత్ర నిర్మాత సుధాకర్ టీ అన్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుంది, చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరన్నదనే సమాచారాన్ని త్వరలో ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.

    కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస కే
    నిర్మాత: సుధాకర్ టి
    సంగీతం: రవి బస్రూర్
    పాటలు: రామజోగయ్య శాస్త్రి
    కెమెరా: కల్యాణ్ బి
    ఎడిటర్: జి.యం.శాస్త్రి
    యాక్షన్: వెంకట్
    బ్యానర్: వందన మూవీస్

    Read more about: haranath హరనాథ్
    English summary
    Late actor Haranath's grandson Virat raj introducing with Seeta Manohara Sri Raghava. Haranath has made his mark in the 70s with highly appreciated performance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X