twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger సెన్సేషనల్ డీల్.. రికార్డు రేటుకు అమ్ముడైన డిజిటల్ రైట్స్

    |

    పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుని ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయి అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

     ట్రెండ్ సెట్టర్ గా

    ట్రెండ్ సెట్టర్ గా


    నువ్విలా అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలు పెట్టి 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే తనదైన నటన, డైలాగ్ డెలివరీతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు సూపర్ హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' సినిమా చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

    ఎలా అయినా హిట్ కొట్టాలని

    ఎలా అయినా హిట్ కొట్టాలని

    ఈ సినిమాలు చేసిన తరువాత 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో విజయాలను అందుకుని చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండకు ఈ మధ్య వరుస ఫ్లాప్ ఎదురవుతున్నాయి. 'నోటా' నుంచి మొదలుకొని.. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి ఫ్లాపులు ఎదురు కావడంతో ఈ సారి ఎలా అయినా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నాడు.

    పూరీతో కలిసి

    పూరీతో కలిసి

    భారీ హిట్ కోసం వేచి చూస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, కరోనా లాంటి అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో చాలా కాలం వరకు టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోవడంతో దాన్ని పూర్తి చేస్తున్నట్లు సినిమా నిర్మాతలు ప్రకటించారు.

    బడ్జెట్ పెంచి

    బడ్జెట్ పెంచి

    'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ల మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 'లైగర్' మూవీకి రూ. 93 కోట్లు బడ్జెట్ అవుతుంది. మొదటి తక్కువలో పూర్తి చేద్దామనుకున్నారు కానీ విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడడం, సౌత్ సినిమాకు నార్త్ లో క్రేజ్ పెరగడంతో బడ్జెట్ పెంచారని అంటున్నారు.

    రికార్డు స్థాయి డీల్‌

    రికార్డు స్థాయి డీల్‌

    ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి భారీ ఆఫర్‌ దక్కినట్లు తెలుస్తుంది. విజయ్‌ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకొని సినిమా రిలీజ్‌కు ముందే లైగర్‌ డిజిటల్‌ రైట్స్‌ని అమెజాన్‌ ప్రైమ్‌ ఏకంగా రూ.60కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుందట. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ బాషలలో విడుదల కానున్న ఈ సినిమా అన్ని బాషల డిజిటల్ రైట్స్ కోనేసుకున్నట్టు సమచారం. ఈ విషయం మీద క్లారిటీ లేదు కానీ నిజమైతే విజయ్‌ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదరిన డీల్‌ ఇదేనని చెప్పచ్చు. ఈ విషయం మీద త్వరలో స్పష్టత రానుంది.

    English summary
    Vijay Devarakonda and Puri Jagannadh's latest movie Liger Digital rights sold out for a bomb.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X