twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనూకి పద్మ అవార్డ్ ఇవ్వాలన్న బ్రహ్మాజీ.. పెద్ద అవార్డ్ వచ్చేసినట్టే అంటూ సోనూ ఆసక్తికర రిప్లై!

    |

    సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం అందరికీ హీరోగా మారాడు. ఇండియాని కరోనా కబళిస్తున్న వేళ తానున్నానని అభయమిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ వెళుతున్నాడు. ముఖ్యంగా రెండో దశ కరోనాలో ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సంజీవని తెచ్చిన చిరంజీవిలా అందరికీ ఆక్సిజన్ కూడా అందిస్తున్నాడు. అయితే తనకు అవార్డ్ ఇవ్వాలన్న బ్రహ్మాజీ డిమాండ్ విషయంలో సోనూ ఆసక్తికరంగా స్పందించారు.

    Recommended Video

    Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Filmibeat Telugu
    నటన మీద మక్కువతో

    నటన మీద మక్కువతో

    ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు కంటే ముందే తమిళ, తెలుగు బాషలలోనే అవకాశాలు దక్కాయి. 1999లో విడుదలైన తమిళ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రతో సినీ తెరంగ్రేటం చేశాడు.

    బాషతో సంబంధం లేకుండా

    బాషతో సంబంధం లేకుండా

    ఆ తర్వాత తమిళంలో మరో సినిమా చేసినా గుర్తింపు దక్కలేదు. తర్వాత తెలుగులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో సోనూసూద్ నటించినా ఆ తర్వాత కూడా ఆయనకు సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు. బాషలతో సంబంధం లేకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు సోనూసూద్.

    సూపర్ గా

    సూపర్ గా

    2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు రిలీజ్ అయిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో సోనూసూద్ కు నెగటివ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య అనే సినిమాలో విలన్ గా చేస్తున్నారు.

    పద్మ అవార్డ్ ఇవ్వాలన్న బ్రహ్మాజీ

    పద్మ అవార్డ్ ఇవ్వాలన్న బ్రహ్మాజీ

    అయితే ఇప్పుడు రియల్‌ హీరోగా మారిన సోనూసూద్‌ గురించి నటుడు బ్రహ్మాజీ ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు. వాస్తవానికి ప్రతి యేటా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. అందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సిఫార్సుల మేరకు ప్రకటిస్తే మరికొన్ని మాత్రం ప్రజల నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు కూడా అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు.

    ఇప్పటికే అందుకున్నా

    ఇప్పటికే అందుకున్నా

    అలా సిఫార్సు చేసేందుకు చివరితేదీ సెప్టెంబర్ 15 వ తేదీ అంటూ కేంద్రం ప్రకటించగా దానిని ప్రస్తావిస్తూ సోను సూద్ కి పద్మవిభూషన్ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నానని అలా ఇంకా ఎవరైనా కోరితే దీనిని రీట్వీట్ చేయాలంటూ అని ట్వీట్ చేశారు.

    ఇక ఈ విషయం మీద స్పందించిన సోనూసూద్ "135 కోట్ల మంది భారతీయుల ప్రేమ నాకు అతిపెద్ద అవార్డు సోదరా, నేను ఇప్పటికే ఆ అవార్డు అందుకున్నాను. " అంటూ కామెంట్ చేశారు. సోను వ్యాఖ్యలు పక్కన పెడితే సోనూ చేస్తున్న సామాజిక సేవకి ఆయన పద్మ పురస్కారానికి అర్హుడని చెప్పచ్చు.

    English summary
    Actor Brahmaji took to his Twitter and recommended that actor and Humanitarian Sonu Sood for Padma Vibhushan, Overwhelmed by Brahmaji’s nomination, Sonu replied, “The love of 135 crore Indians is my biggest award brother, which I have already received. Humbled.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X