twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజిటల్ రిలీజ్ అయిన వారానికి మళ్ళీ థియేటర్స్ లో లవ్ స్టోరీ.. సాయి పల్లవి మార్కెట్ తో అలా!

    |

    కరోనా సెకెండ్ వేవ్ తర్వాత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికగా రిలీజ్ కావడానికి సిద్ధం అవుతోంది. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా అందుకు తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా వచ్చి పడ్డాయి. అయితే ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అది కూడా డిజిటల్ రిలీజ్ అయిన వారానికి. ఆ వివరాల్లోకి వెళితే

    సూపర్ క్రేజ్ తో

    సూపర్ క్రేజ్ తో


    అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ మీద లవ్ స్టోరీని కే నారాయణదాసు నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సిహెచ్ దీనికి సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఒక సున్నితమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లవ్ స్టోరీ' సినిమాకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి, అంచనాలకు అనుగుణంగా సినిమా నుంచి విడుదలైన ప్రతి ప్రమోషనల్ స్టఫ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    మంచి ప్రీ రిలీజ్ తో

    మంచి ప్రీ రిలీజ్ తో

    ప్రేక్షకులలో అంచనాలకు తగ్గట్టే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ. 31.20 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయింది. అలా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లవ్ స్టోరీ' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. దసరాకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా అప్పుడు కూడా ఈ సినిమా సత్తా చాటింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

    25 రోజుల కలెక్షన్లు ఇలా

    25 రోజుల కలెక్షన్లు ఇలా

    ఎవరూ ఊహించని విధంగా దసరా సమయంలో కూడా పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అలా 25 రోజుల్లో వచ్చిన టోటల్ కలెక్షన్స్ చూస్తే నైజాంలో 12.58 కోట్లు, సీడెడ్‌లో 4.47 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.73 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.47 కోట్లు, గుంటూరులో 1.58 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.50 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ 94 లక్షలు వసూలు చేసింది. లవ్ స్టొరీ సినిమా ఏపీ, తెలంగాణలో 25 రోజులకు గాను 27.40 కోట్ల షేర్ అందుకుని 44.68 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

    2.47 కోట్ల ప్రాఫిట్

    2.47 కోట్ల ప్రాఫిట్

    ఇక ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.20 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటివరకు 34.47 కోట్ల షేర్ దక్కింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి ప్రస్తుతం 2.47 కోట్ల ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసి మున్ముందుకు పోతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ వేదికగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కొంత మంది ప్రేక్షకులు ఎదురు చూడగా వారి ఎదురు చూపులు ఫలించి అక్టోబర్ 22వ తేదీన డిజిటల్ ప్రేక్షకుల కోసం ఆహా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

    మలయాళంలో రిలీజ్

    మలయాళంలో రిలీజ్

    అదలా ఉంచితే ఈ సినిమా మరోసారి థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అది తెలుగు వెర్షన్ మాత్రం కాదు. ఈ సినిమాని మలయాళంలో డబ్బింగ్ చేసి ప్రేమ తీర్థం పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మలయాళం లో సాయి పల్లవికి మంచి మార్కెట్ ఉండటంతో దీన్ని వదులుకొని ఉద్దేశం ఇష్టంలేక నిర్మాతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. అలా డిజిటల్ వేదికగా విడుదలైన వారం రోజులకు సినిమా 29వ తేదీ అక్టోబర్ నెలలో కేరళ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. చూడాలి కేరళ లో కలెక్షన్లు ఏ మేరకు వస్తాయి అనేది.

    English summary
    Love Story movie to release in malayalam as Prema theeram on October 29th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X