For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రంజుగా 'మా' రాజకీయం.. వాళ్ళందరితో నరేష్ చర్చలు.. నైట్ డిన్నర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

  |

  తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారుతున్నాయి. ఒకప్పుడు ఈ ఎన్నికలు కేవలం నామమాత్రంగానే ఉండేవి ఎందుకంటే దాదాపు అప్పట్లో ఏకగ్రీవంగానే వ్యక్తులను ఎన్నుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఐదుగురు బరిలోకి దిగుతున్నామని ప్రకటించడంతో పాటు కొందరు సభ్యులైతే పోటీ దారులపై తిరుగుబాటు ప్రయత్నాలు కూడా చేయడం సంచలనంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో నటి హేమ మా అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని మా నిధులను ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ దుర్వినియోగం చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీస్తున్నారు అని చెబుతూ చిరంజీవి సైతం ఈ అంశం మీద సీరియస్ అయ్యారు.

  వెంటనే మా క్రమశిక్షణ అధ్యక్షుడైన కృష్ణంరాజుకు ఒక లేఖ కూడా రాశారు. వెంటనే రంగంలోకి దిగిన నరేష్ హేమ వ్యాఖ్యలను ఖండించారు కూడా. అయితే హేమ ఆరోపించిన విధంగా ఇప్పుడు నరేష్ తీసుకుంటున్న కొన్ని చర్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. హేమ ఏమని ఆరోపించారు అంటే ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎలాంటి కష్టం లేకుండా గతంలో సంఘంలో ఉన్న నిధులు అన్నింటినీ ఖర్చు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతే కాక ఇప్పుడు ఎన్నికలు జరగకుండా చూసుకుని మళ్లీ తానే అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఆమె ఎందుకు ఆరోపణలు చేశారు అనేది తెలియదు గాని ఇప్పుడు నరేష్ తన మద్దతుగా ఉండే దాదాపు 100 మందికి నిన్న రాత్రి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సందర్భం ఏమీ లేకపోయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

   MAA President Naresh Dinner for MAA members

  మా అధ్యక్షుడిగా ఎన్నికైన అప్పటి నుంచి తనకు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి విషయంలో అండగా నిలిచినందుకు మా సభ్యులు అందరికీ పార్టీ ఏర్పాటు చేయగా కేవలం వంద మంది వరకు హాజరు అయ్యారని తెలుస్తోంది. ఈ పార్టీకి ప్రముఖ నటులు కమెడియన్ అలీ, శివబాలాజీ, పృథ్వీరాజ్, సంపూర్ణేష్ బాబు, కరాటే కళ్యాణి వంటి వారు హాజరు అయ్యారని తెలుస్తోంది. నరేష్ పార్టీకి హాజరైన వారందరూ హేమ మీద, హేమ చేసిన వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘానికి లేఖలు రాయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ విందులో మా సభ్యులందరినీ నరేష్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని తాను ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడలేదు అనే విషయాన్ని వారికి వివరించి తనకు అండగా నిలవాలని కోరినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కేవలం 900 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం అయితే జరుగుతోంది. మరి దీనిలో ఎవరు ఎలా స్పందిస్తారో అనేది మాత్రం వేచిచూడాల్సి ఉంది.

  English summary
  MAA President Naresh gave a dinner party at his residence on Friday night. The party was attended by over 100 people.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X