Just In
- 1 hr ago
బాలయ్య కొత్త చిత్రానికి అల్లు అర్జున్ టైటిల్.. బడా ప్రొడ్యూసర్‌తో బోయపాటి చర్చలు.!
- 2 hrs ago
వెరీ ఇంట్రెస్టింగ్: మెగా కాంబినేషన్‌పై పవన్ స్పందన.. తప్పకుండా చేస్తానంటూ ప్రకటన
- 12 hrs ago
హైదరాబాద్‌లో కంగనాకు చేదు అనుభవం.. బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని వెళ్లినా వదల్లేదట.!
- 13 hrs ago
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్.. ఈ సారి అదిరిపోతుందట.!
Don't Miss!
- News
చంద్రబాబు..వెనక్కు నడుస్తూ: రివర్స్ పాలనపై నిరసన: తుగ్లక్ పాలన అంటూ..!
- Sports
టెస్టు, వన్డే మ్యాచ్‌ల అరంగేట్రంలో సెంచరీలు.. తొలి క్రికెటర్‌గా ఆబిద్ అలీ రికార్డు!!
- Finance
FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్: ఇలా చేయండి...
- Technology
విండోస్ 10 మొబైల్ యూజర్లకు షాక్
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 16-12-2019
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
కమిట్మెంట్ పేరుతో పడుకోవడానికి వస్తావా అని డైరెక్ట్‌గా! అలా అయితేనే.. యంగ్ హీరోయిన్ సంచలనం
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లైంగికంగా లొంగ దీసుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మొదలైన మీటు ఉద్యమమం దేశమంతా విస్తరించింది. అలాగే టాలీవుడ్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలపై పలువురు సినీ తారలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ మాధవీలత ఇదే కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.

దర్శక నిర్మాతల పడక గది.. అలా అయితేనే
దర్శక నిర్మాతల పడక గదికి వెళితే తప్ప ఇక్కడ సినిమా అవకాశాలు అంత ఈజీ కాదని, వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ బయటపడదని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి మాధవిలత. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగాన్ని ఈ సందర్బంగా ఆమె వివరించింది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది.

సినిమాలకే పరిమితమై.. ఆ తర్వాత
నచ్చావులే సినిమాతో అలరించిన మాధవీలత.. నాని హీరోగా వచ్చిన స్నేహితుడా సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాలకే పరిమితమై కనుమరుగైపోయింది మాధవీలత. మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి మరోసారి చర్చలకు బాట వేసింది మాధవి.

సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్.. సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది సాధారణమని చెప్పిన మాధవీలత.. నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని, కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేశారని చెప్పింది.

కామవాంఛ తీరిస్తే తప్ప.. మాధవీలత కామెంట్
తనకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది మాధవీలత. అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని, అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు తెలిపింది. పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు.. ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదనే కోణంలో మాధవీలత కామెంట్ చేయడం గమనార్హం.